close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 23/06/2020 23:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పతంజలి కరోనా ఔషధంలో ఏమేం ఉన్నాయంటే?

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారి సోకిన వారి సంఖ్య 90 లక్షలకు పైగా ఉండగా.. మరణాలు 4,80,000 పైగా ఉన్నాయి. భారత్‌ విషయానికొస్తే, దేశంలో ప్రస్తుతం నాలుగున్నర లక్షలకు పైగా కరోనా బాధితులు ఉన్నారు. 14,000 మందికి పైగా మరణించారు. ప్రపంచమంతా కొవిడ్‌-19 ఔషధం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. తాము కరోనా వైరస్‌ నివారణకు ‘కరోనిల్‌’ అనే ఔషధాన్ని కనుగొన్నామనే పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నిజానికి కొవిడ్‌పై కరోనిల్‌ పనితీరును ఏ సాధికార వైద్య సంస్థ నిర్ధారించక పోయినప్పటికీ.. తమ ఔషధం శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుందని.. తద్వారా కరోనాను నయం చేస్తుందని పతంజలి సంస్థ సహవ్యవస్థాపకులు, యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా అంటున్నారు. సంస్థ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...

* పతంజలి కరోనా ఔషధం ఓ కిట్‌ రూపంలో లభిస్తుంది. దీనిలో కరోనిల్‌, స్వాసారీ అనే రెండు రకాల మాత్రలు, ‘అను ఆయిల్‌’ అనే తైలం ఉంటాయి.

* వీటి తయారీలో అశ్వగంధ, గిలోయి, తులసి తదితర వనమూలికలతో సహా 100కు పైగా పదార్థాలను వాడారట.

* ఈ ఔషధం 6 నుంచి 80 సంవత్సరాల వయసు వారికి ప్రయోజనకరం.

* ఈ మాత్రలను రోజుకు రెండు సార్లు భోజనం అనంతరం అరగంట తర్వాత వేడి నీటితో తీసుకోవాలి.

* రెండు దశల్లో ప్రయోగాలు విజయవంతమైన అనంతరం తాము ఈ ఔషధాన్ని విడుదల చేశామని పతంజలి సంస్థ ప్రకటించింది. తొలిదశ ప్రయోగాల్లో పాల్గొన్న 280 బాధితులకు పూర్తిగా నయమైందని.. అనంతరం క్లినికల్‌ ట్రయల్స్‌ను కూడా తాము నిర్వహించామని బాబా రామ్‌దేవ్‌ వెల్లడించారు.

* ఈ ఔషధాన్ని సేవించిన కరోనా రోగుల్లో ఎవ్వరూ చనిపోలేదని ఆయన అన్నారు. అంతేకాకుండా వారిలో 69 శాతం మందికి కేవలం మూడు రోజుల్లోగా నయంకాగా... ఏడు రోజుల్లో 100 శాతం నయమైందని రామ్‌దేవ్ ప్రకటించారు.

* తమ ప్రకటనకు ఆధారం అనదగ్గ ఔషధ పరీక్ష వివరాలను అతి త్వరలోనే విడుదల చేస్తామని సంస్థ ప్రకటించింది.

* రూ.545 విలువైన ఈ ఔషధం 30 రోజులకు సరిపోతుందని ఈ సంస్థ ప్రకటించింది.

కరోనా నివారణకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు ఏ ఔషధం కొవిడ్‌-19 పై కచ్చితంగా ప్రభావం చూపుతుందనేందుకు ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కొవిడ్‌ నివారణకు 130 వ్యాక్సిన్‌లు ప్రయోగ దశలో ఉండగా, వాటిలో పది ముందంజలో ఉన్నాయని ఈ అంతర్జాతీయ సంస్థ తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.