వ్యాక్సిన్‌ పంపిణీకి కఠిన నిర్ణయాలు అవసరం
close

తాజా వార్తలు

Updated : 11/07/2020 18:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ పంపిణీకి కఠిన నిర్ణయాలు అవసరం

ముంబయి: కొవిడ్‌-19 ఔషధాలు, వ్యాక్సిన్‌ అన్ని దేశాలకు అందుబాటులో ఉండాలని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అన్నారు. ఎక్కువ బిడ్డింగ్‌ వేసేవాళ్లకు కాకుండా అవపరమైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ చేరాలని ఆయన సూచించారు. అసమానతలు చోటుచేసుకుంటే కరోనా వైరస్‌ మహమ్మారి మరింత కాలం ఉంటుందని హెచ్చరించారు. అంతర్జాతీయ ఎయిడ్స్‌ సొసైటీ కొవిడ్‌-19పై ఏర్పాటు చేసిన వర్చువల్‌ సమావేశంలో గేట్స్‌ పాల్గొన్నారు.

‘మార్కెట్‌ శక్తులు కాకుండా సమానత్వం ఆధారంగా వ్యాక్సిన్‌ పంపిణీ జరిగేలా కఠిన నిర్ణయాలు తీసుకొనే నాయకులు మనకు కావాలి. అవసరమైన ప్రజలు, ప్రాంతాలకు కాకుండా ఎక్కువ డబ్బులు చెల్లించేవారికి వ్యాక్సిన్‌ దొరికితే మహమ్మారి మరింత కాలం కొనసాగుతుంది. ఇంకా ప్రమాదకరంగా మారుతుంది’ అని గేట్స్‌ హెచ్చరించారు. ఎయిడ్స్‌ ఔషధాలు అందరికీ అందుబాటులోకి వచ్చినట్టే కొవిడ్‌కూ రావాలని కోరుకున్నారు.

అమెరికా, ఐరోపా, భారత్‌ సహా అనేక దేశాల్లో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం బిలియన్‌ డాలర్లు ఖర్చుచేస్తున్నారు. కొన్ని జంతువులపై ప్రయోగాలు పూర్తి చేసుకొని మానవులపై పరీక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వస్తే కేవలం శక్తిమంతమైన దేశాలకు దేశాలకు మాత్రమే అందుబాటులోకి వచ్చి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. అలా కాకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస, మరికొన్ని సంస్థలు సూచిస్తున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని