తెలంగాణలో టెస్టుల సంఖ్య పెంచుతాం
close

తాజా వార్తలు

Updated : 04/07/2020 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో టెస్టుల సంఖ్య పెంచుతాం

హైదరాబాద్‌: దిల్లీ తర్వాత అత్యధిక మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నది తెలంగాణలోనేనని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి. శ్రీనివాసరావు‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత నెలరోజుల్లో 12వేల మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందారని తెలిపారు. ప్రస్తుతం 6,556 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని, అవసరమైన వారికి టెలీమెడిసిన్‌, వీడియోకాల్‌ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. తెలంగాణలోని కరోనా రోగులకు గాంధీ, ఫీవర్‌ ఆసుపత్రి, కింగ్‌కోఠి, చెస్ట్‌ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని మాత్రమే గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు చెప్పారు.

బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి...

కొవిడ్‌ ఆసుపత్రుల్లో 2,501 బెడ్‌లు ఉండగా ప్రస్తుతం 1034 బెడ్స్‌పై బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా మే నెలాఖరు వరకూ తక్కువ కేసులు నమోదయ్యాయని, అన్‌లాక్‌ -1, 2లో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని వివరించారు. జూన్‌ మొదటి వారంలో 938, రెండో వారంలో 1015, మూడో వారంలో 3481, నాలుగో వారంలో 7,461 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మరణాలు ఇతర వ్యాధులు ఉన్న వారిలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం 13 ల్యాబ్‌ల ద్వారా రోజుకు 6,500 టెస్టులు చేస్తున్నామని, త్వరలో మరో ఐదు ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. టెస్టుల సంఖ్య కూడా పెంచుతామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చామని, మరో 5 ల్యాబ్‌లకు అనుమతులు వచ్చాయని చెప్పారు. మరికొన్ని రోజుల్లో టెస్టింగ్‌ కోసం అధునాతన పరికరాలు అందుబాటులోకి తెస్తామన్నారు.

‘‘ ప్రైవేటు ల్యాబ్‌లలో డేటా సరిగాలేదని గుర్తించాం. 13 ల్యాబ్‌లలో తప్పుడు నివేదికలు, టెస్టులు సరిగా చేయలేదని తేలింది.  వారికి నోటీసులు ఇచ్చా. ఒక్కో పోర్టల్‌లో ఒక్కోలాగా అప్‌లోడ్‌ చేస్తున్నారు. నిపుణుల కమిటీ ప్రైవేటు ల్యాబ్‌ల ఫలితాలను పరిశీలిస్తోంది. హిమాయత్‌ నగర్‌లోని ఒక ల్యాబ్‌లో దాదాపు 72 శాతం మందికి పాజిటివ్‌ అని ఇచ్చారు. 8వేల పరీక్షలు చేసే సామర్థ్య ప్రైవేటు ల్యాబ్‌లకు ఉంది. తెలంగాణలో నిన్నటితో 50వేల పరీక్షలు పూర్తి చేశాం. రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తోంది. గాంధీలో ఒకరిద్దరు వైరల్‌ చేసిన పోస్టుల కంటే క్యూర్‌ అయిన వారి సంఖ్య చూసి మాట్లాడాలి. సోషల్‌ మీడియాలో కరోనా బులిటెన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తమ కుటుంబాలను పణంగా పెట్టి  ఆరోగ్య సిబ్బంది పనిచేస్తున్నారు’’ అని డీహెచ్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని