మన నిర్లక్ష్యం వల్ల కోటి కేసులు..!
close

తాజా వార్తలు

Published : 14/06/2020 14:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మన నిర్లక్ష్యం వల్ల కోటి కేసులు..!

ఇప్పటికైనా మారండి: తేజ

హైదరాబాద్‌: ప్రజల నిర్లక్ష్యం వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని దర్శకుడు తేజ అన్నారు. ఇప్పటికైనా ప్రజలు నిర్లక్ష్య ధోరణిని వదిలేయాలని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లకు సందేశమిచ్చారు. ప్రజలు ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో దేశంలో రోజుకీ లక్ష కరోనా కేసులు రావొచ్చని ఆయన అన్నారు.

‘నిర్లక్ష్య వైఖరి కారణంగానే కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. కరోనా వైరస్‌ వల్ల తమకి ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఇలాంటి ఆలోచన విధానాన్నే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. ప్రస్తుతం దేశంలో రోజుకీ వేల సంఖ్యలోనే కేసులు చూస్తున్నాం. కొన్నిరోజుల్లో దేశంలో రోజుకీ లక్ష కేసులు కూడా రావొచ్చు. కోటి మంది బాధితులతో ప్రపంచంలోనే భారత్‌ మొదటిస్థానంలో ఉండొచ్చు. అలా జరగకూడదనుకుంటే ఇప్పటికైనా మారండి. నిర్లక్ష్యాన్ని వదిలేసి శుభ్రతకు పెద్దపీట వేయండి. మనం ఎవర్ని కలిస్తే వారికి కరోనా లేదని నమ్ముతున్నాం. అందుకే కొంతమంది వ్యక్తులు సరుకులు, కూరగాయలు కొనడానికి షాప్‌కి వెళ్లడం.. అక్కడ అన్నింటినీ ముట్టుకోవడం.. కొనుగోలు చేసిన వాటిని తీసుకువచ్చి శుభ్రం చేయకుండా ఇంట్లో పెట్టేస్తున్నారు. ఇలాంటి వాటివల్లే కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వదిలేసి.. ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. దేశాన్ని కాపాడండి’ అని తేజ అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని