జూన్‌ కల్లా స్మార్ట్‌ఫోన్ల తయారీ సాధారణ స్థితికి: షియామీ
close

తాజా వార్తలు

Published : 05/05/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జూన్‌ కల్లా స్మార్ట్‌ఫోన్ల తయారీ సాధారణ స్థితికి: షియామీ

శ్రీసిటీ ప్లాంటు కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి
108 మెగాపిక్సెల్‌ కెమేరాతో ఎంఐ 10 ఫోన్‌ 8న ఆవిష్కరణ

దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ వచ్చే నెలకల్లా సాధారణ స్థితికి చేరొచ్చని, జులై-సెప్టెంబరుకు గిరాకీ కూడా మెరుగుపడుతుందనే అంచనాను షియామీ వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో, ఆరంజ్‌-గ్రీన్‌ జోన్లలో ఇకామర్స్‌ సంస్థలు అత్యవసరం కాని ఉత్పత్తులు కూడా విక్రయించేందుకు సిద్ధమైన నేపథ్యంలో, కంపెనీ ఈ అంచనాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆ రాష్ట్రప్రభుత్వ అనుమతి లభించినట్లు షియామీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనుజైన్‌ తెలిపారు. రాబోయే కొన్ని రోజుల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని వెల్లడించారు. జూన్‌ నాటికి ఉత్పత్తి సాధారణ స్థితికి చేరొచ్చనే అంచనాను వ్యక్తం చేశారు. రెండు వారాల తయారీకి సరిపడా విడిభాగాలు సమీకరించాక, ఉత్పత్తిని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 108 మెగాపిక్సెల్‌ కెమేరాతో ఎంఐ10 ఫోన్‌ను ఈనెల 8న సంస్థ ఆవిష్కరించనుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని