close

తాజా వార్తలు

Published : 22/09/2020 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. రష్యా నుంచి రెండో వ్యాక్సిన్‌!

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రష్యానుంచి మరో వ్యాక్సిన్‌ రానుంది. సైబీరియాకు చెందిన వెక్టార్‌ ఇనిస్టిట్యూట్‌ తయారుచేసిన ‘EpiVacCorona’ వ్యాక్సిన్‌ అక్టోబర్‌ 15నాటికి రిజిస్టర్‌ చేసుకునే అవకాశాలు ఉన్నట్లు రష్యా మీడియా సంస్థ టీఏఎస్‌ఎస్‌ వెల్లడించింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఈ మధ్యే పూర్తయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. క్షమాపణ కోరితే ఎంపీల వేటుపై ఆలోచిస్తాం!

రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు క్షమాపణ కోరితే వారిపై వేటును తొలగించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. రాజ్యసభలో మంగళవారం 8 మంది సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్షాలు వాకౌట్‌ చేసిన తర్వాత ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. సెక్స్‌ వర్కర్లకు రేషన్‌ ఇవ్వండి: సుప్రీం కోర్టు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. వైరస్‌ ప్రభావం సెక్స్‌వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇదే జీవనాధారంగా బతుకుతున్న లక్షల మంది రోడ్డున పడ్డారు. వీరిలో రేషన్‌ కార్డులు కూడా ఉండనివారెందరో.  అలాంటి వారందరికీ న్యాయం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ ఎల్‌ఎన్‌రావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రేషన్‌ కార్డు లేకపోవడాన్ని మానవ తప్పిదంగా పరిగణించి వారం రోజుల్లోగా వారికి అవసరమైన రేషన్‌ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మా ఆందోళనకు మద్దతివ్వండి:అమరావతి ఐకాస

అమరావతిలో రాజధానిని కొనసాగించాల్సిన ఆవశ్యకతను తెలియజేసేందుకు దిల్లీ వెళ్లిన మహిళా ఐకాస నాయకులు రెండోరోజు పలువురు ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిశారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు నేతృత్వంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సౌగతారాయ్‌, శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌, లోక్‌సభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ సురేశ్‌ను అమరావతి మహిళా ఐకాస నాయకులు, రైతులు కలిశారు. అమరావతి సమస్య, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని వాళ్లకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. వ్యాపార విస్తరణకు షావోమి సరికొత్త మార్గం

షావోమీ మొబైల్స్‌కు భారత్‌లో ఆదరణ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చైనాకు చెందిన ఈ మొబైల్‌ సంస్థ ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. కరోనా నేపథ్యంలో మొబైల్స్‌ అమ్మకాలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు పలు రకాల ఉత్పత్తులు గ్రామీణస్థాయి వినియోగదారులను చేరుకోవడం కొద్దిగా కష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో షావోమి ఇండియా యాజమాన్యం సరికొత్తగా ఆలోచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. తెలంగాణలో అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం

తెలంగాణలో కొత్త రెవెన్యూ విధానంలో భాగంగా భూమి హక్కులు- పట్టాదారు పాస్‌ పుస్తకాల చట్టంతో పాటు వీఆర్వో పోస్టుల రద్దు చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇటీవల వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల ఆమోదం పొందిన బిల్లులకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఆమోదముద్ర వేయడంతో చట్టాలుగా మారాయి. ఈమేరకు చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 19న గెజిట్‌ నోటిఫికేషన్లు ప్రచురించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ప్రజల్ని మభ్యపెడుతూ తెరాస పాలన: బండి

అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు ప్రజల్ని మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు, హక్కుల్ని ప్రభుత్వం పోలీసుల సాయంతో కాలరాస్తోందని దుయ్యబట్టారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టిన భాజపా నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. చూచిరాత పరీక్షల వైపు..విద్యాలయాల చూపు!

కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థల కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడింది. ఇప్పటికే తరగతి గదులకు దూరమైన విద్యార్థులు.. పరీక్షలకు దూరమవుతున్నారు. విద్యా సంస్థలకు పరీక్షల నిర్వహణ కూడా కత్తిమీద సాములా మారింది. దీన్ని అధిగమించేందుకు ఇప్పటికే పలు యూనివర్సిటీలు ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానాన్ని(ఓబీఈ) అమలుచేస్తున్నాయి. ఈ విధానంలో పుస్తకాలను చూసుకుంటూ పరీక్షలు రాసే వీలుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. స్మాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూసివేత

ప్రముఖ గేమింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ స్మాష్‌ మూతపడినట్లు ఆంగ్లవార్త సంస్థ మింట్‌ కథనంలో పేర్కొంది. దేశంలోని మొత్తం 19 నగరాల్లో 40చోట్ల ఇది వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి కొన్నేళ్లుగా ప్రముఖ  క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.  ఈ కంపెనీ ప్రధానంగా నగర యువతను దృష్టిలో ఉంచుకొని వ్యాపారం నిర్వహిస్తుంది. కానీ, ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం పడిపోవడంతో మూసివేయాల్సి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. సెప్టెంబరు 22: చిరు కెరీర్‌లో అరుదైన రోజు

సెప్టెంబరు 22. అగ్ర కథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో అరుదైన, ఎప్పటికీ గుర్తిండిపోయే రోజు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘ప్రాణం ఖరీదు’ విడుదలైన నేటికి 42ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనని ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు చెబుతూ చిరు ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.