close

తాజా వార్తలు

Published : 12/08/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

1. ఏపీలో ఇళ్లపట్టాల పంపిణీ మళ్లీ వాయిదా

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15న నిర్వహించాలనుకున్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అక్టోబర్‌ 2న ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలని భావిస్తోంది. తొలుత ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది రోజున చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. అనంతరం జులై 8న వైఎస్‌ జయంతి సందర్భంగా ఇవ్వాలని యోచించింది. ఇళ్ల సేకరణ ఆలస్యంతో ఆగస్టు 15కు వాయిదా వేసింది.

2. శిరోముండనం కేసు: స్పందించిన రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బాధితుడికి అండగా నిలబడేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. దీంతో ఏపీకి చెందిన సాధారణ పరిపాలన విభాగానికి ఈ కేసుకు సంబంధించిన దస్త్రం బదిలీ అయింది. అసిస్టెంట్‌ సెక్రటరీ జనార్ధన్‌బాబును కలవాలని, కేసు విషయంలో ఆయనకు సహకరించాలని బాధితుడు వరప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. పౌరుల హక్కులు కాలరాస్తున్నారు: చంద్రబాబు

రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు  ట్విటర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ వైద్యులపై అమానుషంగా ప్రవర్తించడం సరికాదని పేర్కొన్నారు.  ఎస్సీ విద్యార్థి మహేష్‌ ఉన్నత చదువులకు ఆటంకాలు కలిగించడం భావ్యం కాదన్నారు. చదువులకు ఆటంకం కల్పిస్తే విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.  ఇప్పటికైనా మహేష్‌కు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మోదీతో ఏదైనా సాధ్యమే.. రాహుల్‌ సెటైర్‌!

 ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ సారి ఆర్థిక వ్యవస్థనపై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విరుచుకుపడ్డారు. మోదీ ఉన్నారుగా ఏదైనా సాధ్యమే అంటూ సెటైర్‌ వేశారు. దేశ వృద్ధిరేటు స్వాతంత్య్రం వచ్చాక అత్యంత కనిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని నారాయణ మూర్తి హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన న్యూస్‌క్లిప్పింగ్‌ను జోడిస్తూ.. ‘మోదీ ఉన్నారుగా ఏదైనా సాధ్యమే’ అంటూ రాహుల్‌ బుధవారం ట్వీటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. రెండు వారాల్లో రష్యా టీకా తొలి బ్యాచ్‌ రెడీ

కరోనావైరస్‌పై రష్యా తయారు చేసిన  స్పుత్నిక్‌-వి టీకా తొలి బ్యాచ్ మరో రెండు వారాల్లో సిద్ధమవుతుందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్‌ మురాస్కో తెలిపారు. ప్రస్తుతం దీనిని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌, ఏఎఫ్‌కే సిస్టమాస్‌కు చెందిన బిన్నో ఫార్మాలో తయారు చేస్తున్నారు. ఇక్కడ ఏడాదిలో 500 మిలియన్‌ డోసులు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ టీకా తీసుకునేవారిని పర్యవేక్షించడం కోసం రష్యా ప్రత్యేకంగా ఒక యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కలత చెందడం సహజమే కదా..!:గహ్లోత్‌

నెలరోజుల ప్రతిష్టంభన అనంతరం రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభానికి తెరపడిన విషయం తెలిసిందే. ఈ నెలరోజుల నుంచి ముఖ్యమంత్రి వర్గం ఎమ్మెల్యేలు జైపుర్‌లోని హోటల్‌లోనే మకాం వేశారు. పార్టీ నాయకత్వంతో మంతనాల అనంతరం సచిన్‌ పైలట్‌ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి వర్గం ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి చెందినట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన సమాచారంతో ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేలను కలిసేందుకు హోటల్‌కు వెళ్లిన సందర్భంలో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. పీపీఈ కిట్లు ధరించి ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నం

విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ సీఎం  క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌ను ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకులు యత్నించారు. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఇప్పటికే ఎన్‌ఎస్‌యూఐ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టులో కేసు కొనసాగుతున్న సమయంలో ఓయూ, యూజీ సెట్‌ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని కార్యకర్తలు నినాదాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. రూ.8వేల కోట్లు ఏం చేశారు: యనమల

కరోనా వ్యాప్తి నియంత్రణలో వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసిందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘మీరు చెప్పిన కరోనాతో సహజీవనం ఇదేనా?. వైద్యులు, సిబ్బంది ముందస్తు నియామకాల్లో విఫలమయ్యారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం మంచిది కాదు. కేంద్రం ఇచ్చిన రూ.8వేల కోట్లు ఏం చేశారు. కరోనా నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. విషమంగానే ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం!

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రక్తప్రసరణ సవ్యంగానే సాగుతోందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో ఆర్మీ ఆసుపత్రి పేర్కొంది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌కు ఈనెల 10వ తేదీన శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో జరిపిన వైద్య పరీక్షల్లో ప్రణబ్‌కు కొవిడ్‌ వైరస్‌ సోకినట్లు తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. పాప్‌అప్‌ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మీ కొత్త ఫోన్‌

ప్రముఖ మొబైల్ ఫోన్‌ తయారీ సంస్థ షావోమి రెడ్‌మీ కే సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. రెడ్‌మీ కే30 అల్ట్రా పేరుతో విడుదల చేశారు. గతంలో రెడ్‌మీ విడుదల చేసిన కే30, కే30 ప్రో, కే 30 ప్రో జూమ్‌ ఫోన్లకు కొనసాగింపుగా కే30 అల్ట్రాను తీసుకొస్తున్నారు. ఇందులో 7ఎన్‌ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 1000ప్లస్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ముందు వైపు సెల్ఫీల కోసం 20 ఎంపీ పాప్‌ అప్‌ కెమెరాను ఇస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.