close

తాజా వార్తలు

Published : 21/09/2020 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

1. రైతుల శ్రేయస్సు కోసమే ఆ బిల్లులు: మోదీ

దేశ రైతుల శ్రేయస్సు కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంబంధిత బిల్లులను తీసుకువచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయా బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందిన సందర్భంగా ఆయన దేశ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్‌లో శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో 'ఇంటింటికీ ఫైబర్'‌ సహా పలు ప్రాజెక్టులను మోదీ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం దేశ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కేంద్ర సాయుధ బలగాల్లో లక్ష ఖాళీలు

బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఏర్పడ్డ ఖాళీలేనని తెలిపింది. ఈ మేరకు సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అత్యధికంగా బీఎస్‌ఎఫ్‌లో 28,926 ఖాళీలు ఉన్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అప్పుడున్న సంబురాలు ఇప్పుడేవి?: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు ఉపయోగపడేవే అయితే వారంతా ఎందుకు సంబురాలు చేసుకోవడం లేదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రెవెన్యూ బిల్లును తెలంగాణ చట్టసభలు ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబురాలు జరిగాయని, బిల్లుపై  రైతులోకం పూర్తిస్థాయిలో హర్షించిందని గుర్తు చేశారు. కేంద్ర వ్యవసాయ బిల్లులు రైతులకు ప్రయోజనం చేకూర్చినవైతే ఎన్టీయే మిత్రపక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయని కేటీఆర్‌ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. రష్యా వ్యాక్సిన్‌: 120కోట్ల డోసులకు ఆర్డర్‌!

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌కు భలే గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం మూడోదశ ప్రయోగాల్లో ఉన్న రష్యా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-V’ కోసం దాదాపు 20దేశాల నుంచి 100కోట్ల డోసులకుపైగా కోసం వినతులు వచ్చినట్లు వ్యాక్సిన్‌ తయారీ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్‌ కోసం పది దేశాలు ఒప్పంద దశకు చేరుకోగా, ఇప్పటివరకు దాదాపు 120కోట్ల డోసుల కోసం వినతులు వచ్చినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఏపీలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్‌

‘ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ సేవ’ యాప్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. దేశంలోనే తొలిసారిగా సరికొత్తగా రూపొందించిన ఈ యాప్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ యాప్‌కు రూపకల్పన చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండానే ప్రజలకు 87 రకాల సేవలు దీని ద్వారా అందనున్నాయి. పోలీస్‌స్టేషన్‌ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందే అవకాశం కల్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. విమాన ఇంధనంగా హైడ్రోజన్‌

హైడ్రోజన్‌ ఆధారంగా ప్రయాణించే విమాన తయారీపై  పరిశోధనలను ఎయిర్‌బస్‌ ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా 200 మంది ప్రయాణికులతో 2,000 నాటికల్‌ మైళ్ల దూరం ప్రయాణించే విమానం డిజైన్లను సిద్ధం చేసింది. దీనిలో హైడ్రోజన్‌ ఆధారంగా పనిచేసేలా మార్పులు చేసిన గ్యాస్‌ టర్బైన్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇటువంటి మొత్తం మూడు డిజైన్లను సిద్ధం చేసింది.  2035 నాటికి విమానాలను ఉద్గార రహితంగా మార్చేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలో భాగంగా దీనిని సిద్ధం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. పోలవరం పెండింగ్‌ నిధులివ్వండి

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని కోరారు. ఎత్తిపోతల పథకాలకు కేంద్ర సహకారంపైనా చర్చించారు.అనంతరం అనిల్‌ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థికశాఖతో సమన్వయం చేసుకొని త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామని గజేంద్రసింగ్‌ హామీ ఇచ్చారన్నారు. పోలవరాన్ని సందర్శించాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కొత్త మరణాల్లో 86% ఆ 10 రాష్ట్రాల్లోనే..

దేశంలో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు. తాజాగా మరో 86,961 కేసులు, 1130 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు, మరణాల్లో అత్యధికం  కేవలం పది రాష్ట్రాల్లోనే కావడం గమనార్హం. నిన్న దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కొవిడ్‌ మరణాల్లో 86శాతం కేవలం 10 రాష్ట్రాల్లో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. కొడాలి నాని వ్యాఖ్యలు హేయం: రఘురామ

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మంత్రి కొడాలి నాని మాట్లాడటం హేయమని ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. పరమత సహనాన్ని కాపాడాలని సూచించారు. అనవసరంగా గొడవలకు దారితీయొద్దని హితవు పలికారు. తనను వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలంతా లక్ష్యంగా చేసుకున్నారని, వారంతా ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. దేవాలయాలపై జరిగిన దాడులను హిందువులకు తగిలిన గాయాలుగా రఘురామ అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. సరూర్‌నగర్‌ చెరువులో నవీన్‌ మృతదేహం 

నగరంలోని సరూర్‌నగర్‌ సమీపంలో వరదనీటిలో పడి కొట్టుకుపోయి గల్లంతైన నవీన్‌(45) మృతదేహం లభ్యమైంది. సుమారు 20 గంటలపాటు డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సరూర్‌నగర్‌ చెరువులో గాలించారు. ఘటన జరిగిన ప్రదేశానికి వందమీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. నవీన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.