close

తాజా వార్తలు

Published : 30/09/2020 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. సివిల్స్‌ పరీక్ష వాయిదా పిటిషన్‌ కొట్టివేత

సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 4న యథాతథంగా జరగనుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించాలని యూపీఎస్సీకి సుప్రీంకోర్టు సూచించింది. అలాగే చివరిసారి పరీక్ష రాస్తున్న వారి విషయంలో కీలక సూచన చేసింది. కరోనా కారణంగా పరీక్షకు హాజరు కాకపోతే వారికి మరోసారి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని యూపీఎస్సీకి సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఇప్పటికైనా ఆ ఆరోపణలు మానుకోండి:లక్ష్మణ్‌

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. ఇన్నాళ్లూ బాబ్రీ కూల్చివేత ఘటనపై కాంగ్రెస్ సహా పలు రాజకీయ పక్షాలు భాజపాపై చేస్తున్న ఆరోపణలు తప్పని తాజా తీర్పుతో రుజువైందన్నారు. ఇప్పటికైనా ఆయా పార్టీలు తప్పుడు ఆరోపణలు, మత రాజకీయాలు మానుకోవాలని లక్ష్మణ్‌ హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీపై కేసీఆర్‌ కసరత్తు

 తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై వచ్చే నెల ఆరో తేదీన జరగనున్న అత్యన్నత మండలి(అపెక్స్‌ కౌన్సిల్‌) సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రగతి భవన్‌లో రేపు మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నదీజలాల విషయంలో కావాలనే ఏపీ ప్రభుత్వం కయ్యం పెట్టుకుంటోందని కేసీఆర్ ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కొవిడ్‌ మరణాల్లో భారత్‌ది తప్పుడు లెక్క: ట్రంప్‌  

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చ సందర్భంగా.. కరోనా విషయంలో డెమొక్రాటిక్‌  అభ్యర్థి జో బైడెన్‌, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఏ ప్రణాళిక లేని ట్రంప్‌ వైఖరి పలువురు అమెరికన్ల ప్రాణాలు తీసిందని బైడెన్‌ విరుచుకుపడ్డారు. కాగా, అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తక్కువే అని.. భారత్‌ తదితర దేశాలు మరణాలకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపుతున్నాయని ట్రంప్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. రాష్ట్రాన్ని జగన్‌ అప్పుల్లో ముంచారు‌: యనమల

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ముఖ్యమంత్రిగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెచ్చిన అప్పులను రాష్ట్రాభివృద్ధిపై ఖర్చు పెట్టకుండా జగన్‌ అనుచరులకే పంచి పెడుతున్నారని విమర్శించారు. తెదేపా పాలనలో ఏడాదికి రూ.26వేల కోట్ల అప్పులు చేస్తే.. వైకాపా పాలనలో ఏడాదికి రూ1.13లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా: ఆడ్వాణీ

బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు భాజపా అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీ పేర్కొన్నారు. ఇది చరిత్రాత్మకమైన తీర్పు అని, నేడు మనందరికీ సంతోషకరమైన రోజు అని ఆడ్వాణీ అన్నారు. రామజన్మభూమి పట్ల తన వ్యక్తిగత, పార్టీ నిబద్ధతను తాజా తీర్పు నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసులో తమను నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఆడ్వాణీ ఈ విధంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మరో దారుణం..!

సామూహిక అత్యాచారానికి గురై.. తీవ్ర గాయాలతో పదిరోజులకు పైగా మృత్యువుతో పోరాడి ఓడిపోయిన యువతికి న్యాయం చేసే విషయంలో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉంది. ఆమె మృతదేహాన్ని దిల్లీలోని ఆసుపత్రి నుంచి నేరుగా హాథ్రాస్‌కు తరలించి అక్కడే అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు మృతురాలి రక్తసంబంధీకులను కూడా అనుమతించలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎప్పటిలానే పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ట్రంప్‌ సరే.. కమల, బైడెన్‌ సంగతేంటి?

అధ్యక్ష పదవికి ముందు నుంచే కోట్లాది డాలర్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన డొనాల్డ్‌ ట్రంప్‌.. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అంశం ఇటీవల బాగా చర్చనీయాంశమైంది. అయన గతంలో ఎన్నికల బరిలో నిలిచిన 2016, అధ్యక్షుడిగా ఉన్న 2017లోనూ పన్ను రూపంగా కేవలం 750 డాలర్ల చొప్పున చెల్లించినట్టు కథనాలు వెలువడ్డాయి. అసలు గత పదిహేను సంవత్సరాల్లో పదేళ్ల పాటు ఆయన ఏ విధమైన పన్ను చెల్లించలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యర్థి వర్గంలోని జో బైడెన్‌, కమలా హారిస్‌ల సంగతేంటనే ప్రశ్న పలువురిలో తలెత్తింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. యోగికి సీఎంగా కొనసాగే హక్కులేదు:ప్రియాంక 

యూపీలోని హాథ్రస్‌లో యువతిపై జరిగిన అమానవీయ ఘటనానంతరం పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కామాంధుల దాహానికి బలైపోయిన ఆ యువతి భౌతికకాయానికి  అంత్యక్రియలు కూడా చేసుకొనే అవకాశం కుటుంబానికి కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించడంపై మండిపడుతూ ప్రియాంక వరుస ట్వీట్లు చేశారు. యోగి ఆదిత్యనాథ్‌కు యూపీ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కులేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. సజ్జనార్‌ను కలిసిన హేమంత్‌ కుటుంబ సభ్యులు

హేమంత్‌ హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అతని కుటుంబ సభ్యులు బుధవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. హేమంత్‌ కుటుంబ సభ్యులతో పాటు తనకు కూడా ప్రాణహాని ఉందని హేమంత్‌ భార్య అవంతి సీపీ సజ్జనార్‌కు వివరించారు. హేమంత్‌ హత్య తరువాత జరిగిన పరిణామాలను సీపీకి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.