తూర్పు గోదావరి జిల్లాలో మళ్లీ లాక్‌డౌన్‌
close

తాజా వార్తలు

Updated : 23/06/2020 22:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తూర్పు గోదావరి జిల్లాలో మళ్లీ లాక్‌డౌన్‌

రాజమహేంద్రవరం: కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న వేళ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌ రెడ్డి‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25 నుంచి జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీచేశారు. ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్‌లు, షాపింగ్‌ మాల్స్‌, మద్యం దుకాణాల వ్యాపారులకు ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్‌ స్పష్టంచేశారు. 

మాస్క్‌ ధరించకపోతే జరిమానా
తూర్పుగోదావరి జిల్లాలో వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థల కార్యకలాపాలు మాత్రం యథాతథమేనన్నారు. అలాగే, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శుభకార్యాలు, వివాహాలు, ఇతర కార్యక్రమాలకు తహసీల్దార్ల అనుమతితో నిర్వహించుకోవాలనీ.. 10 మంది మాత్రమే పాల్గొనాలని సూచించారు. మాస్క్‌ ధరించకపోతే పట్టణ ప్రాంతాల్లో రూ.100, గ్రామీణ ప్రాంతాల్లో రూ.50ల చొప్పున జరిమానా విధించనున్నట్టు హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ఆరోగ్య సేత యాప్‌ వినియోగించాలని సూచించారు. 

తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు 87 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసులసంఖ్య 706కి చేరింది. వీరిలో 293మంది కోలుకోగా.. ఐదుగురు మరణించారు. ప్రస్తుతం జిల్లాలో 408 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని