జీహెచ్‌ఎంసీ మేయర్‌ డ్రైవర్‌కు కరోనా నిర్ధారణ
close

తాజా వార్తలు

Updated : 11/06/2020 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీహెచ్‌ఎంసీ మేయర్‌ డ్రైవర్‌కు కరోనా నిర్ధారణ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు ఉదయం నుంచి డ్రైవర్‌ విధుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ డ్రైవర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మేయర్‌కు రేపు మరోసారి కరోనా పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. డ్రైవర్‌కు కరోనా నిర్ధారణ కావడంతో మేయర్‌, ఆయన కుటుంబసభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు.

ఇటీవల నగరంలో పర్యటన సందర్భంగా మేయర్‌ ఓ హోటల్‌లో టీ తాగినట్లు గుర్తించిన అధికారులు ఇప్పటికే ఒకసారి ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. మేయర్‌ టీ తాగిన దుకాణంలోని టీ మాస్టర్‌కు గతంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో మేయర్‌కు నెగెటివ్‌ వచ్చింది.

ఇదీ చదవండి..

మేయర్‌ కార్యాలయం మూసివేత


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని