close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 30/06/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీకేజీ

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ఘటన మరువక ముందే పరవాడ ఫార్మాసిటీలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో అర్థరాత్రి రియాక్టర్‌ నుంచి బెంజిన్‌ మెడిజోన్‌ గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న షిఫ్ట్‌ ఇన్‌చార్జ్‌ రావి నరేంద్ర(33)), కెమిస్ట్‌ గౌరీశంకర్‌(26) మృతిచెందారు. చంద్రశేఖర్‌, ఆనందబాబు, జానకీరావు, సూర్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. డిజిటల్‌ యుద్ధం

సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకోవడానికి మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక చర్యకు ఉపక్రమించింది. చైనా ఆర్థిక మూలాలకు హెచ్చరికలు పంపే నిర్ణయాన్ని తీసుకుంది. బహుళ ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన మొబైల్‌ యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ యాప్‌ల వల్ల భారత సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు ముప్పు పొంచి ఉండడంతో ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69-ఎ కింద వీటిని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

చైనాపై ఎలాంటి ప్రభావం?

3. రాకపోకలకు అనుమతులు అక్కర్లేదు

 కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత సడలించింది. మంగళవారం నాటితో అన్‌లాక్‌-1.0 ముగుస్తుండడంతో జులై 1 నుంచి అన్‌లాక్‌-2.0 మొదలుకానుంది. దీనిలో మరిన్ని ఆర్థిక కార్యకలాపాలను దశలవారీగా అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో జులై 31 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, నిషేధించిన కొన్ని కార్యకలాపాలు మినహా మిగతావన్నీ వాటి వెలుపల నిర్వహించుకోవచ్చని స్పష్టంచేసింది. ముందస్తు అనుమతులు, ఈ-పర్మిట్ల అవసరం లేకుండా ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు దేశంలో ఎక్కడైనా తిరగొచ్చని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నన్నొక్కణ్నే తప్పు పడుతున్నారే?

 ‘తిరుమల భక్తుల మనోభావాల గురించి మాట్లాడితే క్రైస్తవ వ్యతిరేకినంటున్నారు. ఇసుక, ఇళ్ల అక్రమాలపై ఆ శాఖల మంత్రులు మాట్లాడాకే నేను వ్యాఖ్యలు చేశా. కానీ మన పార్టీ సామాజిక మాధ్యమ అధిపతి (సోషల్‌ మీడియా హెడ్‌) సూచనలతో.. నన్నే లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీరు వీలైనంత త్వరగా సమయం కేటాయిస్తే నాపై వచ్చిన ఆరోపణలన్నింటినీ వివరిస్తా’ అంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సోమవారం లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

5. చైనా చొరబాట్లు నిజమే

చైనా మాటలకు, చేతలకు పొంతన లేదని ఆధారాలతో సహా తాజాగా రుజువైంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో డ్రాగన్‌ 423 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు స్పష్టమైంది. ఈ క్రమంలో 1960లో తానే స్వయంగా పేర్కొన్న సరిహద్దు (క్లెయిమ్‌ లైన్‌)ను ఉల్లంఘించినట్లు తేలింది. ఈ నెల 25న ‘ఎన్‌డీటీవీ’ సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. భారత్‌కు చెందిన 423 మీటర్ల భూభాగంలో చైనా సైన్యం 16 గుడారాలు, టార్పాలిన్లు, ఒక భారీ షెల్టర్‌ను ఏర్పాటు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. కరోనా టీకా తయారీలో ‘భారత్‌ బయో’ ముందడుగు

‘కరోనా’ వైరస్‌కి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాపై మరో ముందడుగు పడింది. మొదటి- రెండో దశ క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. ప్రీ-క్లినికల్‌ అధ్యయనాలకు సంబంధించి.. తాము పంపిన సమాచారం ఆధారంగా పరీక్షలకు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది.  మొదటి-రెండో దశ క్లినికల్‌ పరీక్షలను వచ్చే నెలలోనే మనుషులపై నిర్వహిస్తామని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. ముగ్గురు అక్కలపై ఉన్మాదం

 రక్తం పంచుకుపుట్టిన ముగ్గురు అక్కలపై ఓ ఉన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు...ఇద్దరు తొబుట్టువులు చనిపోగా...మరొకరి పరిస్థితి విషమంగా ఉంది...మూడో అక్కను చంపేటప్పుడు అడ్డుగా వచ్చిన బావనూ పొడిచేశాడు.. నాలుగో అక్కనూ చంపుదామనుకున్నాడు.. హైదరాబాద్‌ పాతనగరంలో సోమవారం రాత్రి ఏడు గంటలకు ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఠాణా పరిధి బార్కస్‌ సలాలాలో అహ్మద్‌ ఇస్మాయిల్‌(27) అనే మాజీ బౌన్సర్‌ తల్లి పుత్లీబేగంతో కలిసి ఉంటున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. వారికి మంట వీరికి పంట

అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్‌ ధరల్లో చమురు ధరలను చమురు విక్రయ కంపెనీలు మార్పు చేసుకునే వీలుంది. అయితే ఈ పెట్రోలు, డీజిల్‌ ధరల్లో మూడింట ఒక వంతు మాత్రమే చమురు కంపెనీలకు వెళ్తుంది. రెండు వంతులు పన్నుల రూపేణా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలోకి వెళ్తుంది. అంటే కంపెనీలు ధరలు పెంచినా వాస్తవంగా ప్రయోజనం పొందుతోంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే అత్యధికంగా ప్రయోజనం పొందేది కేంద్ర ప్రభుత్వమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

ఆదుకోవాల్సింది పోయి దోపిడీయా?​​​​​​​

9. ఈ కరోనా పరిస్థితుల్లో మళ్లీ చిత్రాలు నిర్మిస్తామో లేదో!

‘‘కృష్ణ అండ్‌ హిస్‌ లీలా’ చిత్రం రెగ్యులర్‌ కథతో రూపొందిందే అయినా ఆ కథను నేటి తరానికి తగ్గట్లు కొత్త ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రానికి ప్రతిఒక్కరూ చక్కగా కనెక్ట్‌ అవుతున్నారు’’ అన్నారు నిర్మాత డి.సురేష్‌బాబు. ఆయన నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చిన చిత్రమిది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్‌ పేరేపు తెరకెక్కించారు. రానా సమర్పించారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం.. జులై 4 నుంచి ఆహా ఓటీటీలోనూ రానుంది. ఈ సందర్భంగా సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా మీడియాతో ముచ్చటించారు సురేష్‌బాబు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

 

10. ధోని దున్నేశాడు!

ధోని దున్నేశాడు.. మైదానంలో కాదు పొలంలో! మిగిలిన క్రికెటర్ల కన్నా ఎప్పుడూ భిన్నంగా ఉండే మహి.. మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. రాంచిలోని తన వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ పొలం దున్నాడు ధోని. మహి ట్రాక్టర్‌ నడుపుతున్న వీడియోను అతడి భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.