భారత్‌లో ‘జార్జ్‌ ఫ్లాయిడ్‌లు’...
close

తాజా వార్తలు

Published : 28/06/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో ‘జార్జ్‌ ఫ్లాయిడ్‌లు’...

తమిళనాడు కస్టడీ మరణాలపై ఉవ్వెత్తున నిరసనలు

చెన్నై: తమిళనాడు పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు తండ్రీ కొడుకులు మరణించిన ఘటన సోషల్‌ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. పి జయరాజ్‌, ఆయన కుమారుడు బెనిక్స్‌లకు ట్యుటికోరన్‌ పట్టణంలో మొబైల్‌ దుకాణం ఉంది. లాక్‌డౌన్‌ నిబంధనలు అనుమతించిన సమయం తర్వాత కూడా తమ దుకాణాన్ని తెరిచి ఉంచినందుకు.. పోలీసులు వారిని గత శుక్రవారం అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులను దూషించటం, బెదిరింపులకు పాల్పడటం అనే నేరాలను వారిపై ఆరోపించారు. కాగా వారు నాలుగు రోజుల అనంతరం ఆస్పత్రిలో మరణించారు. కాగా, సాతాంకుళం పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది వారిని తీవ్రంగా కొట్టడం వల్లే వారు మృతిచెందారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సమాజంలో వివిధ వర్గాల వారి నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి.  #JusticeForJeyarajAndFenix పేరుతో నెట్టింట్లో నిరసనలు ఊపందుకున్నాయి.

ప్రియాంకా చోప్రా- ‘‘ఈ విషయం విన్నప్పటి నుంచి నా తల తిరుగుతోంది. నేను పూర్తిగా నివ్వెరపోయాను. నేరం ఏదైనా కానీ.. ఏ మనిషి మీదా అంత క్రూరత్వం చూపకూడదు. మాకు నిజాలు కావాలి. అసలు వారి కుటుంబం పరిస్థితి ఏంటనే విషయం ఊహించటానికి కూడా నాకు భయంగా ఉంది. ఇందుకు బాధ్యులైన వారిని వదిలేయకూడదు.. తగిన శిక్ష విధించాలి.  నా ప్రార్థనలు వారికి శక్తిని చేకూర్చాలి. మనందరం కలసి జయచంద్రన్, బెనిక్స్‌ లకు న్యాయం చేసేందుకు మన గళాన్ని వినిపించాలి. జస్టిస్‌ ఫర్‌ జయరాజ్‌ అండ్‌ ఫెనిక్స్’’

ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ- గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ ఈ ఘటనను గత నెల మృతిచెందిన ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతంతో పోల్చారు. ‘‘ప్రియమైన బాలీవుడ్‌ మిత్రులారా... తమిళనాడులో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. మన ఇన్‌స్టాగ్రామ్‌ కార్యదక్షత ఇతర దేశాలకే పరిమితమా?భారత్‌లో ఎందరో జార్జ్‌ ఫ్లాయిడ్‌లు ఉన్నారు. ఈ విధమైన పోలీసుల క్రూరత్వం, దాడులు గుండెను బద్దలు చేస్తున్నాయి. జస్టిస్‌ ఫర్‌ జయరాజ్‌ అండ్‌ ఫెనిక్స్’’ అన్నారు.

శిఖర్‌ ధావన్‌- ‘‘తమిళనాడులో జయరాజ్‌, ఫెనిక్స్‌ (బెనిక్స్‌)లపై జరిగిన క్రూరత్వాన్ని విని నాకు భయం కలిగింది. వారి కుటుంబానికి న్యాయం కలిగేలా చూసేందుకు మనం తప్పకుండా గొంతెత్తి నినదించాలి. జస్టిస్‌ ఫర్‌ జయరాజ్‌ అండ్‌ ఫెనిక్స్.’’

‘జయం’ రవి- ‘‘న్యాయానికి ఎవరూ అతీతులు కారు. వారి అమానుష చర్యలకు శిక్ష పడాలి. జస్టిస్‌ ఫర్‌ జయరాజ్‌ అండ్‌ ఫెనిక్స్’’

కాగా, ఈ ఘటనలో నలుగురు పోలీసు సిబ్బందిని ఇద్దరు ఎస్సైలతో సహా సస్పెండ్‌ చేశారు. ట్యుటికోరన్‌లో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. శుక్రవారం ఆ జిల్లాలోనే కాకుండా, పరిసర ప్రాంతాల్లో కూడా దుకాణాలను మూసివేశారు. వారి కుటుంబానికి ముఖ్యమంత్రి  పళనిస్వామి రూ.20 లక్షల నష్టపరిహారం, రెండు ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించారు. ఈ కేసుపై విచారణను మద్రాస్‌ హైకోర్టు చేపట్టింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని