ఆశలు రేకెత్తిస్తున్న రెమ్డెసివిర్‌..!
close

తాజా వార్తలు

Published : 10/06/2020 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆశలు రేకెత్తిస్తున్న రెమ్డెసివిర్‌..!

కోతుల్లో ఊపిరితిత్తులు దెబ్బతినడాన్ని నిరోధించిన ఔషధం..

వాషింగ్టన్‌ : కొవిడ్‌-19 వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘రెమ్డెసివిర్‌’ ఔషధాన్ని కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ఇప్పటికే పలు దేశాల్లో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోతుల్లో జరిపిన ప్రయోగాల్లో ఊపిరితిత్తులు దెబ్బతినడాన్ని ఈ ఔషధం నిరోధిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం ప్రముఖ జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమైంది.

పరిశోధనల్లో భాగంగా తొలుత 12 కోతులకు కరోనా వైరస్‌ సోకించారు. అనంతరం వీటిలో ఆరు కోతులకు రెమ్డెసివిర్ ఔషధాన్ని అందించారు. దీంతో ఈ మందు స్వీకరించిన కోతుల్లో ఎలాంటి శ్వాసకోస సంబంధ వ్యాధులు బయటపడలేదు. అంతేకాకుండా ఈ మందులు ఊపిరితిత్తులు దెబ్బతినడాన్ని తగ్గించినట్లు పరిశోధనల్లో తేలినట్లు ఆ నివేదిక వెల్లడించింది.

ఇప్పటికే కరోనా సోకిన వ్యక్తుల్లో జరిపిన ప్రయోగాల్లో రెమ్డెసివిర్ మెరుగైన ఫలితాలు చూపించినట్లు ఇప్పటికే బయటపడింది. అయితే దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నారు. కొవిడ్‌-19 బాధితులపై వినియోగించడానికి ఇదివరకే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అత్యవసర అనుమతి (ఎమెర్జెన్సీ యూజ్‌ ఆథరైజేషన్‌) ఇచ్చింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌తోపాటు ఔషదంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని