వైరస్‌ విజృంభణ: చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌
close

తాజా వార్తలు

Published : 29/06/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరస్‌ విజృంభణ: చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌

ఇంటర్నెట్ ‌డెస్క్‌: చైనాలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభించింది. రాజధాని బీజింగ్‌ సమీప ప్రాంతాల్లో కొవిడ్‌-19 కేసులు ఒక్కసారిగా పెరగడంతో ఆదివారం లాక్‌డౌన్‌ విధించారు. దాదాపు ఐదు లక్షల మందిపై తాజా ఆంక్షల ప్రభావం పడింది.

వైరస్‌ను చైనా కట్టడి చేసినప్పటికీ బీజింగ్‌లో వందల కేసులు నమోదవ్వడం గమనార్హం. అంతేకాకుండా పక్కనే ఉండే హెబెయ్‌ ప్రావిన్స్‌లో కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆన్‌షిన్‌ కౌంటీలో బీజింగ్‌ నుంచి 150 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాలను పూర్తిగా మూసేసి నియంత్రణలోకి తీసుకుంటున్నామని వైద్యాధికారులు ప్రకటించారు. కరోనా ఆవిర్భావ ప్రాంతం వుహాన్‌ మాదిరిగానే ఇక్కడా కఠిన ఆంక్షలు అమలు చేయనున్నామని వెల్లడించారు.

నిత్యావసరాలు, ఆహారం, ఔషధాల కొనుగోలుకు ఒక కుటుంబం నుంచి రోజుకు ఒక్కరికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఈ కౌంటీలో రవాణా, ప్రయాణంపై పరిమిత ఆంక్షలే ఉండగా ఇప్పుడు మరింత కఠినతరం చేశారు. వైద్యం చేయించుకొనేందుకు వ్యక్తిగత ప్రయాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మొదట బీజింగ్‌లోని షిన్‌ఫడి టోకు ధరల ఆహార మార్కెట్లో వైరస్‌ ఔట్‌బ్రేక్‌ అయింది. ఇక్కడికి ఆన్‌షిన్‌ నుంచి మంచినీటి చేపలను సరఫరా చేస్తారు. తొలుత ఇక్కడ వైరస్‌ను కట్టడి చేశామని ప్రకటించడం గమనార్హం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని