ఇకనైనా వృథా చేయకుండా ఉంటారు: మంచులక్ష్మి
close

తాజా వార్తలు

Published : 10/06/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇకనైనా వృథా చేయకుండా ఉంటారు: మంచులక్ష్మి

హైదరాబాద్‌: రోజువారీ కూలీలు ఉపాధి లేక ఇబ్బందిపడుతున్న ఇటువంటి సమయంలో వారి ఆకలి తీర్చడం అన్నింటికంటే ముఖ్యమని నటి మంచు లక్ష్మి పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల గురించి ఆమె తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘వలస కార్మికులు, మన ఇళ్లల్లో పనిచేసే వారి పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇలాంటి వారంతా నెల జీతంపై ఆధారపడి జీవిస్తుంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి ఆకలి తీర్చడం అన్నింటికంటే ముఖ్యం. లాక్‌డౌన్‌ తర్వాత ప్రజలు అనవసరంగా బయటకురారని ఆశిస్తున్నా. కొందరు తమ హోదా, డబ్బుల్ని చూపించుకోవడానికి వివాహాలు అత్యంత ఘనంగా చేస్తుంటారు. డబ్బుల్ని మంచి పనుల కోసం ఉపయోగిస్తే బాగుంటుంది. ఇకనైనా ప్రజలు అనవసరంగా డబ్బుల్ని ఖర్చుచేయకుండా.. ఉపయోగిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.

అనంతరం మహిళలపై దాడులు, వేధింపుల గురించి మాట్లాడుతూ.. ‘గృహ హింస ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. మనం మహిళల్ని శక్తివంతంగా తయారు చేయాలి. వారు తమ ఉత్తమ జీవితాలను గడపడానికి, వేధింపులకు గురైనా ఎదుర్కోవడానికి వీలైనంత సమాచారం ఇవ్వాలి’ అని చెప్పారు.

లాక్‌డౌన్‌లో ‘లాక్‌అప్‌ విత్‌ మంచులక్ష్మి’ పేరుతో నటి లైవ్‌ షోలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రముఖుల్ని ఆమె ఇంటర్వ్యూ చేశారు. దీనికి గురించి ప్రశ్నించగా.. ‘లాక్‌డౌన్‌ వల్ల నా పనుల్ని రద్దు చేసుకోవాల్సి పరిస్థితి. ఆరంభంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో కొత్త ఆలోచన వచ్చింది. అలా లైవ్‌లు చేశా. ఇంటర్వ్యూల వల్ల ప్రజల్లోనూ వివిధ అంశాలపై అవగాహన ఏర్పడింది’ అని పేర్కొన్నారు. మంచు లక్ష్మి ఈ లాక్‌డౌన్‌లో తన ఎన్జీవో ద్వారా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని