విమానయానాలపై డబ్ల్యూహెచ్‌వో ఏమందంటే!
close

తాజా వార్తలు

Updated : 08/07/2020 00:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విమానయానాలపై డబ్ల్యూహెచ్‌వో ఏమందంటే!

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో విమాన ప్రయాణీకులందరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ  (డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్‌ మాట్లాడుతూ ‘‘మహమ్మారి, క్వారంటైన్‌ నిబంధనల పేరుతో ప్రజలు కట్టిపడేయొద్దు. కరోనా వైరస్‌ ఎక్కడైనా ఉండొచ్చు, అలానే ప్రతి చోటా ఉండొచ్చు. ఈ విషయాన్ని ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలి. వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉంది. దీనిని ప్రజలు తీవ్రంగా పరిగణించాలి. మీరు విమానాల్లో ప్రయాణిస్తున్నట్లయితే సామాజిక దూరం పాటించే అవకాశం లేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు ఇతర జాగ్రత్తలను పాటించాలి’’ అని తెలిపారు.

గత నెలలో నార్తర్న్‌ హెమిస్పియర్‌ వేసవి సెలవులు ప్రారంభం అవడానికి ముందే డబ్ల్యూహెచ్‌వో ప్రయాణ మార్గదర్శకాలను విడుదలచేస్తాననిన ప్రకటించింది. అయితే వాటిని ఇప్పటి వరకు వెల్లడించలేదు. ‘‘ప్రజలు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. అనుకున్నదానికంటే పరిస్థితులు మరింత మెరుగుపడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో రకాల పరిస్థితులను చూస్తున్నాం. కొన్ని దేశాలు ఇప్పటికే మొదటి విడత వైరస్‌ వ్యాప్తిని చూశాయి. ఇప్పుడు రెండో దశ వ్యాప్తిని చూస్తున్నాయి’’ అని ఆస్ట్రేలియా, హాంగ్‌కాంగ్‌ను ఉద్దేశించి హ్యారిస్‌ అన్నారు. ఆస్ట్రేలియాలో రెండో అతి పెద్ద నగరమైన మెల్‌బోర్న్‌లో రెండో విడత లాక్‌డౌన్‌ విధించారు. నిత్యావసరాలకు తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని అక్కడి అధికారులు సూచించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని