వైద్యులు, నర్సులకు ఇండిగో భారీ ఆఫర్‌
close

తాజా వార్తలు

Published : 02/07/2020 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైద్యులు, నర్సులకు ఇండిగో భారీ ఆఫర్‌

దిల్లీ: కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందికి ప్రముఖ విమాన యాన సంస్థ ఇండిగో శుభవార్త చెప్పింది. దేశంలో వైద్యులు, నర్సులకు విమాన ఛార్జీల్లో రాయితీలు ప్రకటించింది. ఈ ఏడాది చివరి వరకు విమాన ఛార్జీల్లో 25శాతం మేర రాయితీ కల్పించనున్నట్టు తెలిపింది. దేశానికి సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞత చాటేందుకు ‘కుకీ క్యాంపెయిన్‌’ కింద ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చెక్‌ ఇన్‌ సమయంలో ఈ రాయితీ పొందే వైద్యులు, నర్సులు తమ ఆస్పత్రి ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. ఈ నెల 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు తమ వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకొనే వైద్యులు, నర్సులకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంచుతున్నట్టు ఇండిగో సీవోవో విలియం బౌల్టెర్‌ తెలిపారు. 
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని