భారత్‌లో కరోనా.. 3లక్షలు దాటేసింది‌!
close

తాజా వార్తలు

Published : 12/06/2020 20:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో కరోనా.. 3లక్షలు దాటేసింది‌!

దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. దేశంలో ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 3లక్షల మార్కును దాటేసింది. ఈ రోజు ఉదయం 8గంటల వరకు దేశంలో 2,97,535 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించగా.. తాజాగా వేలాది కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,019కి పెరిగింది. మరోవైపు, దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర లక్షకు పైగా కేసులతో తొలి స్థానంలో నిలవగా.. తమిళనాడు 40,698 కేసులు, దిల్లీ 34,687 కేసులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.  ప్రపంచంలో కరోనా వైరస్‌ అత్యధికంగా ప్రభావితం చేస్తున్న టాప్‌ 10 దేశాల్లో భారత్‌ నాలుగో స్థానానికి చేరుకుంది. నిన్న ఒక్క రోజే అత్యధికంగా 396 మంది మృత్యువాత పడటంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 8,498కి చేరుకుంది.

మహారాష్ట్రలో లక్ష దాటేశాయ్‌!

శుక్రవారం ఒక్క రోజే మహారాష్ట్రలో 3,493 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,141కి చేరుకుంది. కొత్తగా 127 మంది మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 3717కి పెరిగింది. మరోవైపు, ఈ ఒక్కరోజే 1718 మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో డిశ్చార్జి అయినవారి సంఖ్య 47,793కి పెరిగింది. ఒక్క ముంబయి మహానగరంలోనే ఈ రోజు 1366 పాజిటివ్‌ కేసులు, 90 కొత్త మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 55,451కి పెరగ్గా.. 2044 మంది మృత్యువాతపడ్డారు.

రికవరీ శాతం 49.47% 

దేశంలో కరోనాతో పోరాడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 1,47,195 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీ శాతం 49.47శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య కన్నా కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉండటం కొంత ఉపశమనం కలిగించే విషయం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని