close

తాజా వార్తలు

Published : 26/07/2020 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

​​​​అసత్య వార్తలపై అలీబాబా కంపెనీకి సమన్లు

దిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం అలీబాబా గ్రూప్‌, దాని వ్యవస్థపాకుడు జాక్‌ మాకు గురుగ్రామ్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టింది. అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ వెబ్‌లో గతంలో పనిచేసిన పుష్పేంద్ర సింగ్‌ పర్మార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. చైనాకు వ్యతిరేకంగా ఉన్న వార్తలను ఆ కంపెనీ సెన్సార్‌ చేస్తోందని పేర్కొన్నారు. అలాగే యూసీ బ్రౌజర్‌, యూసీ న్యూస్‌లో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2000 నోట్లు రద్దు, భారత్‌- పాక్‌ మధ్య యుద్ధం అంటూ తప్పుడు వార్తలను యూసీ న్యూస్‌ పబ్లిష్‌ చేసిందని పేర్కొన్నారు. ఇండియా- చైనా సరిహద్దుకు సంబంధించిన వార్తలను సెన్సార్‌ చేసిందని ఫిర్యాదులో తెలిపారు.

ఈ మేరకు గురుగ్రామ్‌ జిల్లా సివిల్‌ జడ్జి.. అలీబాబా కంపెనీ సహా జాక్‌మాకు సమన్లు జారీ చేశారు. నేరుగా గానీ, లాయర్‌ ద్వారా గానీ జులై 29న కోర్టు ముందు హాజరవ్వాలని సూచించారు. నెల రోజుల్లో రాతపూర్వక సమాధానం ఇవ్వాలని ఈ నెల 20న జారీ చేసిన సమన్లలో పేర్కొన్నారు. భారత్‌- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో 59 చైనా యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇందులో యూసీ బ్రౌజర్‌, యూసీ న్యూస్‌ కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆయా యాప్స్‌ నుంచి భారత ప్రభుత్వం సమాధానం కోరింది. ఈ నేపథ్యంలో అలీబాబా గ్రూప్‌పై ఆరోపణలు రావడం గమనార్హం. తాము స్థానిక చట్టాలకు కట్టుబడే పనిచేస్తున్నామని యూసీ ఇండియా పేర్కొంది. అయితే, పిటిషన్‌పై నేరుగా ఎలాంటి కామెంట్‌ చెయ్యలేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.