ఆ దేశంలో ఉచితంగా కరోనా టీకా..
close

తాజా వార్తలు

Published : 02/12/2020 19:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ దేశంలో ఉచితంగా కరోనా టీకా..

బిల్లు పాస్‌ చేసిన జపాన్ ప్రభుత్వం

టోక్యో: దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..తమ ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్-19 టీకాను అందించాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం దానికి సంబంధించిన బిల్లును కూడా పాస్‌ చేసింది. 12.6 కోట్ల జనాభా టీకా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఈ బిల్లు వెల్లడిచేస్తోంది. 8.5 కోట్ల మంది ప్రజలకు టీకాలు అందించే లక్ష్యంతో అమెరికన్ తయారీ సంస్థలైన ఫైజర్, మోడెర్నాలతో జపాన్ ఇదివరకే ఒప్పందం చేసుకుంది. అలాగే 12 కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా టీకాను పొందనున్నట్లు ఆ దేశం తెలిపింది. ఇదిలా ఉండగా..క్లినికల్ ప్రయోగాల్లో మంచిపని తీరును ప్రదర్శించిన మోడెర్నా, ఫైజర్ ఇప్పటికే అత్యవసర వినియోగం కోసం అనుమతులకు దరఖాస్తు చేసుకున్నాయి. తాజాగా ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి యూకే అనుమతి మంజూరు చేసింది. దేశంలో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉందని రెండు వారాల క్రితం జపాన్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేసిన అనంతరం ఈ బిల్లుకు ఆమోదం లభించింది.

కాగా, జపాన్‌లో ఇప్పటివరకు కరోనా వ్యాప్తి భారీ స్థాయిలో ఏమీ లేదు. అక్కడ సుమారు 1,50,000 కేసులు, 2100 మరణాలు సంభవించాయి. అయితే, ఇప్పుడు అక్కడ మూడో దఫా విజృంభణ కనిపిస్తోంది. గత కొద్దివారాలుగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల పరిమితి మించిపోతుందని ఇప్పటికే అక్కడి వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని