HYD-VJA మధ్య హైస్పీడ్‌ రైలు రావాలి
close

తాజా వార్తలు

Published : 29/06/2020 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HYD-VJA మధ్య హైస్పీడ్‌ రైలు రావాలి

ప్రభుత్వం తరఫున కృషిచేస్తామన్న కేటీఆర్‌

హుజూర్‌నగర్‌: విజయవాడ ముఖ్యమైన ఆర్థిక కేంద్రం అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోనే హైదరాబాద్‌ ఓ ముఖ్యమైన మెట్రోపాలిటన్‌ నగరమని తెలిపారు. హైదరాబాద్‌- విజయవాడ మధ్య హైస్పీడ్‌ రైలు రావాలని ఆయన ఆకాంక్షించారు. రెండు నగరాల మధ్య హైస్పీడ్‌ రైలు కోసం తమవంతు కృషిచేస్తామని.. రైలు వస్తే హైవే వెంబడి అభివృద్ధి జరుగుతుందని అభిలషించారు. సోమవారం ఆయన హుజూర్‌నగర్‌లో ఆర్డీవో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.పురపాలక కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఉత్తమ్‌కు అభినందనలు తెలిపిన కేటీఆర్‌
రాష్ట్రంలో 43 రెవెన్యూ డివిజన్లు ఉండగా.. వాటిని 73కి పెంచామన్నారు. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చామనీ.. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను తమ పార్టీ హయాంలో 33 జిల్లాలకు పెంచినట్టు కేటీఆర్‌గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి ఈ సందర్భంగా కేటీఆర్ అభినందనలు తెలిపారు. అధికారులు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని