స్థిరాస్తి రంగానికి చేయూతనివ్వండి: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Published : 11/06/2020 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్థిరాస్తి రంగానికి చేయూతనివ్వండి: కేటీఆర్‌

హైదరాబాద్‌: కరోనా సంక్షోభం వల్ల స్థిరాస్తి రంగం కుదేలైందని.. ప్రభుత్వంతో కలిసి స్థిరాస్తి రంగానికి చేయూతనివ్వాలని సిమెంట్‌ కంపెనీలను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. సీఎస్ సోమేశ్‌ కుమార్‌‌, మేయర్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి సిమెంట్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సిమెంట్‌ బస్తా ధరలు తగ్గించాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రభుత్వ సూచనలకు సిమెంట్‌ కంపెనీలు సానుకూలంగా స్పందించాయని.. అంతర్గతంగా చర్చించుకుని ధరల తగ్గింపుపై నిర్ణయం చెబుతామన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఇళ్ల పథకానికి రూ.230కే సిమెంట్‌ బస్తా ఇస్తున్నాయని.. ఇదే ధరను మరో మూడేళ్ల పాటు పొడిగించేందుకు కంపెనీలు అంగీకరించినట్లు వివరించారు.

హుజూర్‌నగర్‌ ప్రాంతంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగాను శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో శిక్షణా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కేంద్రానికి సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని