హరితహారంలో విధిగా పాల్గొనాలి: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Published : 13/06/2020 19:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హరితహారంలో విధిగా పాల్గొనాలి: కేటీఆర్‌

హైదరాబాద్: ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఆరో విడత హరితహారం, పట్టణ ప్రగతి, వీధి వ్యాపారులకు రుణాలు, వర్షాకాల సన్నద్ధత తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి పురపాలిక బడ్జెట్‌లో 10 శాతం నిధులు పచ్చదనం కోసం ఖర్చు చేయాలన్నారు. హరితహారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విధిగా పాల్గొన్నాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

ప్రతి శుక్రవారం ‘గ్రీన్‌ ఫ్రైడే’గా పాటించి నాటిన మొక్కల సంరక్షణ చూడాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రీన్‌ ఫ్రైడేను పెద్ద ఎత్తున నిర్వహించాలని పేర్కొన్నారు. హరితహారం నిర్వహణ సమన్వయం కోసం పురపాలక శాఖ డైరెక్టరేట్‌లో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు చెప్పారు. ప్రతి పట్టణానికి ఒక నర్సరీ ఉండాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. మొక్కలను కాపాడే బాధ్యతను స్థానిక ఛైర్మన్‌, కమిషనర్‌ తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం మరిన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వీధి వ్యాపారులకు రుణాల విషయంపైనా సమావేశంలో చర్చించారు. సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని