29న కేటీఆర్‌ నల్గొండ పర్యటన
close

తాజా వార్తలు

Published : 12/06/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

29న కేటీఆర్‌ నల్గొండ పర్యటన

హైదరాబాద్‌: వర్షాకాలంలో శిథిల భవనాలు కూలి ప్రమాదాలు జరిగితే పురపాలక సంఘాల పరిధిలోని ఛైర్మన్లు, కమిషనర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వెంటనే కూల్చి వేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా పరిధిలోని పురపాలక సంఘాలపై మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి సమీక్షించారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను తప్పకుండా అమలు చేయాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పురపాలక సంఘాలకు గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకొని పట్టణాలలో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ, మిర్యాలగూడలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అవసరాల మేరకు స్వచ్ఛ వాహనాలను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. టాయిలెట్లు, బస్ బేల నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. ఈనెల 29వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని