రాజధాని రైతుల డిమాండ్లను గౌరవించాలి: కన్నా
close

తాజా వార్తలు

Published : 05/06/2020 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధాని రైతుల డిమాండ్లను గౌరవించాలి: కన్నా

అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ అందరి మద్దతూ కూడగట్టుకుని వారు తమ నిరసనలను కొనసాగిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని రైతుల డిమాండ్లను గౌరవించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన లేఖ రాశారు. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులు గత 170 రోజులుగా ఆందోళన చేస్తున్నారని కన్నా గుర్తు చేశారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ రైతులు, మహిళలు, పిల్లలు ఆందోళనలు కొనసాగిస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే రాజధాని ప్రాంత రైతుల డిమాండ్లను గౌరవించి అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని