మాక్కొంచెం టైమ్‌ కావాలి: ఉద్ధవ్‌
close

తాజా వార్తలు

Updated : 24/05/2020 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాక్కొంచెం టైమ్‌ కావాలి: ఉద్ధవ్‌

ముంబయి: రాష్ట్రంలో విమాన సేవలు ప్రారంభించేందుకు తమకు మరింత సమయం కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్రాన్ని కోరారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని కరోనా కేసులు వెలుగు చూసే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడే లాక్‌డౌన్‌ ఎత్తివేసే యోచన లేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 47 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా రోజుకు 2వేలకు పైగానే కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆదివారం ఆయన మాట్లాడారు.

‘‘పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురితో ఇవాళ మాట్లాడా. విమాన సర్వీసులు ప్రారంభించడం ఎంత అవసరమో నాకు తెలుసు. అయితే, మనకు మరింత సమయం కావాలి. కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాబోయే రోజులు చాలా కీలకం. అయితే భయపడాల్సింది ఏమీ లేదు. ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్‌ మే 31తో ముగుస్తుందని చెప్పలేం’’ అంటూ మహారాష్ట్రలో మరిన్ని రోజులు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ఉద్ధవ్‌ చెప్పకనే చెప్పారు. అలాగే మహారాష్ట్రలో విమాన సర్వీసులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదని కేంద్రానికి తన వైఖరికి తెలియజేశారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని