close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 15/06/2020 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తమిళనాడులో మళ్లీ లాక్‌డౌన్‌.. ఎప్పట్నుంచంటే?

చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి విజృంభణ ఎక్కువగా కొనసాగుతున్న నాలుగు ప్రాంతాల్లో మరిన్ని కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌ విధించాలని సీఎం పళని స్వామి నిర్ణయించారు. ఈ మేరకు చెన్నైతో పాటు కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్‌ జిల్లాల్లో జూన్‌ 19 నుంచి 30 వరకు కఠిన లాక్‌డౌన్‌ విధించనున్నారు. ఈ జిల్లాలన్నీ చెన్నై మెట్రోపాలిటన్‌ పోలీస్ పరిధిలోనివే. తాజా లాక్‌డౌన్ కొనసాగే 12 రోజుల్లో వచ్చే రెండు ఆదివారాల్లో మాత్రం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఉంటుందని సీఎం స్పష్టంచేశారు. ఆ రెండు రోజుల్లో మాత్రం వేటికీ మినహాయింపులు ఉండబోవని స్పష్టంచేశారు. దేశంలో నమోదైన అత్యధిక కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. నిన్నటివరకు ఆ రాష్ట్రంలో 44,661 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 430మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో 24,547మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 

మరోవైపు, రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న వేళ ఇప్పటికే కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయాలంటూ రాష్ట్ర ప్రజా ఆరోగ్య, వైద్య నిపుణుల బృందం ప్రభుత్వానికి సూచించింది. సచివాలయంలో సీఎం పళని స్వామి, సీనియర్‌ ఉన్నతాధికారులతో ఈ నిపుణుల కమిటీ దాదాపు గంటకు పైగా సమావేశమై చర్చించింది. కరోనా వైరస్‌ ప్రజల్లో వ్యాపించకుండా అడ్డుకొనేలా నిబంధనలను ఎలా కఠినతరం చేయాలో పలు సూచనలు చేసినట్టు నిపుణుల కమిటీ సభ్యుడు డాక్టర్‌ పి.కుగననంతం తెలిపారు.

లాక్‌డౌన్‌ నిబంధనలివే.. 
> నిత్యావసర సర్వీసులకు మినహాయింపు

> ఎమర్జెన్సీలో తప్ప అద్దె క్యాబ్‌లు, ఆటో సర్వీసులకు అనుమతిలేదు.

> ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం ఉద్యోగులతో పనిచేస్తాయి. 

> కంటైన్‌మెంట్ జోన్‌ల పరిధిలో నివసించే ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు.

> జూన్‌ 29, 30 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి.

> కూరగాయల దుకాణాలు, కిరాణా దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే పనిచేస్తాయి.

> హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకు పనిచేస్తాయి. అయితే, పార్శిల్స్‌కు మాత్రమే అనుమతి.

> రేషన్‌, నిత్యావసర సరకుల దుకాణాలు, మొబైల్‌ షాప్‌లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పనిచేస్తాయి.

టీ దుకాణాలకు అనుమతిలేదు.

> ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాకు మినహాయింపు.

> అమ్మ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచన్లు యథాతథంగా పనిచేస్తాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.