close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 24/06/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయవాడలో లాక్‌డౌన్‌ నిర్ణయం వెనక్కి..

విజయవాడ: కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ విజయవాడలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ స్పష్టంచేశారు. ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అన్నీ యథాతథంగానే ఉంటాయని కలెక్టర్‌ స్పష్టంచేశారు. ఈ నెల 26నుంచి లాక్‌డౌన్‌ విధించనున్న వేళ ప్రజలందరూ నిత్యావసర వస్తువులను రేపు, ఎల్లుండి లోపు సమకూర్చుకోవాలని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. 

కృష్ణా జిల్లాలో ఈ రోజు కొత్తగా 33 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 1096కి పెరిగింది. వీటిలో 507మంది కోలుకోగా.. రాష్ట్రంలోనే అత్యధికంగా 40మంది మృతిచెందారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 549 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.