జర్నలిస్టుల సమస్యలపై కేసీఆర్‌కు రేవంత్ లేఖ
close

తాజా వార్తలు

Published : 10/06/2020 21:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జర్నలిస్టుల సమస్యలపై కేసీఆర్‌కు రేవంత్ లేఖ

హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమైనదని.. కరోనా విపత్కాలంలో పాత్రికేయులకు భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. జర్నలిస్టుల సమస్యలు, భద్రతపై కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అనుక్షణం ప్రజలకు సమాచారం అందించడమే లక్ష్యంగా మీడియా ప్రతినిధులు పనిచేస్తున్నారన్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉంటూ సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఇలాంటి కష్టకాలంలోనూ కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాజా పరిస్థితులపై క్షణక్షణం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న పలువురు మీడియా ప్రతినిధులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువ విలేకరి మనోజ్ కుమార్ కరోనా సోకి మరణించటంతో పాటు మరికొంతమంది కరోనా బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల భద్రత విషయంలో తక్షణ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు. ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఈ సంక్షోభ సమయంలో నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇటీవల మృతి చెందిన పాత్రికేయుడు మనోజ్ కుమార్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని