మహారాష్ట్రలో ఈ-టోకెన్లతో మద్యం విక్రయాలు 
close

తాజా వార్తలు

Published : 12/05/2020 17:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో ఈ-టోకెన్లతో మద్యం విక్రయాలు 

ముంబయి : కరోనా కట్టడిలో భాగంగా మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మందు ప్రియులకు ఆన్‌లైన్‌లో పరిమిత సంఖ్యలో టోకెన్లు కేటాయించి మద్యం అమ్మకాలు చేసే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విధానం ద్వారా మహారాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే ఆన్‌లైన్‌లో ఈ-టోకెన్లు కేటాయిస్తారు. వీటితో మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసేందుకు వీలు కల్పించనున్నారు. ఈ-టోకెన్లు ఉన్నవారిని మాత్రమే మద్యం దుకాణాల వద్ద అనుమతించనున్నారని అధికారులు తెలిపారు. ఈ విధానాన్ని తొలుత పుణెలో అమలు చేయనున్నారు. అక్కడ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మహారాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ తెలిపింది.

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని