close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/06/2020 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహారాష్ట్రలో లక్ష దాటిన కేసులు

ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా తన వికృత రూపాన్ని మరింత తీవ్రం చేస్తోంది. ఇప్పటికే అత్యధిక కేసులతో కొట్టుమిట్టాడుతున్న మహారాష్ట్రలో కొవిడ్‌ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శనివారం ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష మార్క్‌ దాటింది. ఈరోజు ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 3,493 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 1,01,141కు చేరింది. ఇప్పటి వరకు 3,717 మరణాలు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ఇప్పటి వరకు విధించిన లాక్‌డౌన్‌ అమలుతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ ప్రకటన ఉండబోదని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. కేసులు అంతకంతకూ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఆంక్షల తొలగింపు అనివార్యమైందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అలాగే, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కొన్ని రోజుల పాటు కేసులు పెరగడం సహజమని.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడతాయని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* కేసుల సంఖ్యలో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో బాధితుల సంఖ్య 40,698కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 1,982 కేసులు నమోదయ్యాయి. వీరిలో 22,000 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. 367 మంది ప్రాణాలు కోల్పోయారు.

* 36,284 కేసులతో దిల్లీ మూడో స్థానంలో కొనసాగుతోంది. వీరిలో 13,398 మంది కోలుకొని ఇళ్లకు చేరగా.. 1,214 మంది మృత్యువాత పడ్డారు. మే 30, జూన్‌ 11 మధ్య దేశ రాజధానిలో వ్యాప్తి రేటు 21 శాతం పెరగ్గా.. రికవరీ రేటు 8 శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 

* ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో శనివారానికి కేసుల సంఖ్య 22,527కు పెరిగింది. 15,493 మంది కోలుకున్నారు. 1,415 మంది మరణించారు. 

* ఇక ఉత్తర్‌ప్రదేశ్‌ 12,616 కేసులతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం-శనివారం మధ్య కొత్తగా 528 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కొవిడ్‌ బారిన పడి 365 మంది ప్రాణాలు కోల్పోయారు.

* పశ్చిమబెంగాల్‌లో కొవిడ్‌ కేసుల సంఖ్య 10 వేల మార్క్‌ను దాటింది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 476 కేసులు నమోదుకావడంతో అక్కడ కరోనా నిర్ధారణ అయిన వారి సంఖ్య 10,244కు పెరిగింది. కేసుల సంఖ్యలో ప్రస్తుతం ఈ రాష్ట్రం ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక మరణాల సంఖ్య 451గా నమోదైంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.