‘అందుకే కరోనా బారిన పడ్డాను’
close

తాజా వార్తలు

Published : 28/05/2020 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అందుకే కరోనా బారిన పడ్డాను’

కొవిడ్ 19 నుంచి కోలుకున్న మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్

ముంబయి: తన అజాగ్రత్త వల్లే కరోనా వైరస్‌ బారిన పడినట్లు మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌ అన్నారు. కొన్ని రోజులు వెంటిలేటర్ పై చికిత్స పొందినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన కొవిడ్ 19 నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారు. ‘కరోనా బారిన పడటానికి నా అజాగ్రత్తే కారణం. నేను నిపుణులు చెప్పిన విషయాలను సీరియస్‌గా తీసుకోలేదనుకుంటా. అందుకే నేను కరోనా ట్రాప్‌లో పడ్డాను’ అని ఓ ఆన్‌లైన్‌ సమావేశంలో మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా ప్రారంభ దశలో థానే జిల్లాలో సహాయ కార్యక్రమాల నిమిత్తం ఆయన పర్యటించారు. 
తన సంకల్ప శక్తి వల్లే ఈ క్లిష్ట సమయం నుంచి బయటపడ్డానని, గత రెండు వారాలుగా వేగంగా కోలుకున్నానని వెల్లడించారు. ఒక దశలో హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోయాయని తెలిపారు. అయితే ఇప్పుడు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. కొద్ది రోజుల క్రితం ఆ రాష్ట్రానికే చెందిన కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ కూడా కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని