మహారాష్ట్రలో 7వేల మంది ఖైదీలు విడుదల
close

తాజా వార్తలు

Updated : 17/05/2020 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో 7వేల మంది ఖైదీలు విడుదల

ముంబయి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను పోలీసు, జైలుశాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. అలా మహారాష్ట్రలోని వివిధ జైళ్లలో ఉన్న 7,200మంది ఖైదీలను విడుదల చేశారు. ఇప్పటికే జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఆహారం, భద్రత కల్పించడం జైలు సిబ్బందికి తలకు మించి భారంగా పరిణమించింది. దీంతో తాత్కాలిక బెయిల్‌, పెరోల్‌పై ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ 7,200మంది విడుదలయ్యారు.

సామర్థ్యానికి మించి జైళ్లలో ఖైదీలు ఉంటే అలాంటి వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు మార్గనిర్దేశం చేసింది. ఇందులో భాగంగా ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష పడిన ఖైదీలు 11వేల మంది ఉన్నారు. అలాంటి వారందరినీ తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేయనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ కన్నా ముందు 60 జైళ్లలో సుమారు 35వేల మంది ఖైదీలు ఉన్నారట. ఇప్పుడు వీరిలో 7200మందికని విడుదల చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని