లాక్‌డౌన్‌ తర్వాత సెంటిమెంట్‌ ఇదే
close

తాజా వార్తలు

Updated : 09/06/2020 23:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ తర్వాత సెంటిమెంట్‌ ఇదే

ముంబయి: లాక్‌డౌన్‌ ముగిశాక షాపింగ్‌ ఖర్చులు తగ్గించుకోవాలని ఎక్కువ మంది వినియోగదారులు భావిస్తున్నారని భారత రిటైలర్స్‌ సంఘం (రాయ్‌- ఆర్‌ఏఐ) అధ్యయనం వెల్లడించింది.షాపింగ్‌కు కేవలం 33% మంది మాత్రమే ఆసక్తితో ఉన్నారని వెల్లడించింది. 4,239 మందితో వినియోగదారుల సెంటిమెంట్‌ సర్వేను రాయ్‌ చేపట్టింది.

సర్వేలో పాల్గొన్న 78 శాతం మంది తమ ఖర్చుల్లో భారీ తగ్గుదల ఉంటుందని తెలిపారు. 37% మంది కొద్దిమేర తగ్గుదల ఉంటుందన్నారు. ఎలాంటి మార్పు ఉండదని 16% చెప్పగా 6% మంది మాత్రం మునుపటి కన్నా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ‘రిటైల్‌ రంగం మెల్లగా కోలుకుంటుందని సర్వే ద్వారా తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఈ రంగంలో ఆదాయం ఏమీ లేదు. నష్టాలు ఎదుర్కొంది’ అని రాయ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

లాక్‌డౌన్‌ తర్వాత షాపింగ్‌ చేస్తారా అని వినియోగదారులను ప్రశ్నించగా కేవలం 33% మంది కచ్చితమైన స్పందన తెలియజేశారు. 37% ప్రతికూలంగా స్పందించారు. 30% మంది తటస్థంగా ఉన్నారు. బయటకు వెళ్లి షాపింగ్‌ చేస్తారా అని అడగ్గా.. తొలి మూడు నెలల్లో ప్లాన్‌ చేస్తున్నామని 62% మంది స్పందించారు. రాబోయే 3-12 నెలల్లో వెళ్తామని 32%, 12 నెలల వరకు వెళ్లబోమని 6% మంది స్పష్టం చేశారు. టైర్‌ 2, టైర్‌ 3 పట్టణాల్లోని వినియోగదారుల్లో 75% మంది మాత్రం రాబోయే మూడు నెలల్లో షాపింగ్‌ చేస్తామని చెప్పడం గమనార్హం.

బయటకు వచ్చేందుకు వినియోగదారులు ఇష్టపడకపోవడంతో రిటైల్ దుకాణాదారులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, సౌకర్యాలు  కల్పించాలని రాయ్‌ సీఈవో కుమార్‌ రాజగోపాలన్‌ అన్నారు. కొనుగోలు జాబితాలో ప్రాధాన్య పరంగా ఆహారం, సరుకులు, దుస్తులు ముందంజలో ఉన్నాయి. 52% మంది వీటిని ప్రాథమిక అవసరాలుగా గుర్తించారు. 31% మంది కన్జూమర్‌ డ్యూరబుల్స్‌/ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ముఖ్యమైనవని చెప్పారు. 25% మంది అందం, ఆరోగ్యం, వ్యక్తిగత రక్షణకు ప్రాధాన్యమివ్వడం విశేషం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని