బొమ్మ తుపాకీ అనుకొని కాల్చుకున్నాడు..
close

తాజా వార్తలు

Published : 06/06/2020 03:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బొమ్మ తుపాకీ అనుకొని కాల్చుకున్నాడు..

థానే: బొమ్మ తుపాకీ అనుకొని భ్రమపడి తనను తాను కాల్చుకుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా షాహాపూర్‌ పట్టణంలో జరిగింది. షాహాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఘన్‌శ్యామ్‌ ఆదవ్‌ కథనం ప్రకారం... స్థానిక అటగావ్‌లోని రెసిడెన్షియల్‌ కాలనీలో ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

ఈ నేపథ్యంలో పక్క ఫ్లాట్‌లో జరుగుతున్న వేడుకలకు సిద్ధేష్ జనగం(28) హాజరయ్యాడు. పుట్టినరోజు వేడుక జరుగుతున్న ఇంట్లో తుపాకీ కనపడటంతో దానిని బొమ్మ తుపాకీగా భావించి తనను తాను కాల్చుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. తుపాకీ పేలిన శబ్దం విన్న కాలనీ వాసులు అక్కడకు చేరుకోగా, రక్తపు మడుగులో ఉన్న సిద్ధేష్‌ను చూసి ఆందోళన చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తుపాకీ భరత్‌షేరేకు సంబంధించినదిగా గుర్తించిన పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని