close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120078038 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1274396249517522945 [video_short_link] => 1274396249517522945 [created_by] => [created_date] => [modified_by] => 9823470 [modified_date] => 2020-06-21 12:19:24.559482 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 21/06/2020 12:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జర భద్రం..కరోనా పేరిట సైబర్ మోసాలు!

దిల్లీ: కరోనా వైరస్ హెచ్చరికలు, ఆర్థిక సేవల పేరిట సైబర్‌ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్’‌(సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనాకు సంబంధించిన ప్రభుత్వ సహాయ కార్యక్రమాల పేరుతో హానికరమైన ఈ-మెయిల్స్‌తో ప్రజల్ని మభ్యపెట్టే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సైబర్‌ దాడి ఆదివారం నుంచే ప్రారంభమయ్యే అకవాశం ఉందని పేర్కొంది. సైబర్‌ నేరగాళ్ల దగ్గర దాదాపు రెండు మిలియన్ల భారత పౌరుల ఈ-మెయిల్‌ ఐడీలు ఉన్నట్లు గుర్తించామంది. అనుమానాస్పదమైన సందేశాలకు స్పందించొద్దని.. అందులో పంపే లింకులపై ఎట్టిపరిస్థితుల్లో క్లిక్‌ చేయొద్దని హెచ్చరించింది.

మోసగాళ్లు కొవిడ్‌-19 పరీక్షల పేరిట దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌ సహా పలు ఇతర ప్రముఖ నగరాల్లోని ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సీఈఆర్‌టీ-ఇన్‌ తెలిపింది. ప్రభుత్వ అధికారులు, ఇతర అధికారిక సంస్థల ఈ-మెయిల్‌ ఐడీలను పోలిన లేదా నకిలీ ఐడీలతో నేరాలకు పాల్పడొచ్చని హెచ్చరించింది. ncov2019@gov.in వంటి ఈ-మెయిళ్ల ద్వారా ప్రజల్ని మోసం చేయోచ్చని తెలిపింది. ఎలాంటి అనుమానం ఉన్నా లేదా సైబర్‌ మోసానికి గురైనా వెంటనే incident@cert-in.org.inకు సమాచారం అందజేయాలని కోరింది.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.