కనుమరుగు కానున్న పేజరో ఎస్‌యూవీ
close

తాజా వార్తలు

Updated : 28/07/2020 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కనుమరుగు కానున్న పేజరో ఎస్‌యూవీ

ఉత్పత్తి నిలిపివేయనున్న మిత్సుబిషి

టోక్యో: కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రముఖ వాహనం ‘పేజరో ఎస్‌యూవీ’ కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ మధ్యశ్రేణి స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం తయారీని 2021 నుంచి నిలిపివేయనున్నట్టు జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీదారు మిత్సుబిషి మోటార్స్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. వరుసగా రెండవ సంవత్సరం కూడా భారీ నష్టాలు చవిచూడాల్సి రావటంతో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. స్పోర్ట్స్‌ కార్ల విభాగంలో పేజరో అంతర్జాతీయంగా పేరు గడించింది. అత్యంత కఠినమైనదిగా భావించే డాకర్‌ ర్యాలీలో కార్ల విభాగంలో 2001 నుంచి 2005 వరకూ ఈ వాహనం వరుస విజయాలను సాధించింది. గిన్నిస్‌ రికార్డులకెక్కిన ఈ ఘనతను ఇప్పటికీ ఎవరూ కనీసం సమం చేయలేకపోవటం గమనార్హం. 

అయితే, కొవిడ్‌-19 ప్రభావంతో ఈ వాహన అమ్మకాలు అడుగంటాయి. కాగా మంగళవారం నాటికి కనీవినీ ఎరుగని విధంగా మిత్సుబిషి షేర్ల విలువ 10 శాతం కన్నా ఎక్కువగా పడిపోయింది. మరోవైపు మార్చి 2021 నాటికి సంస్థ సుమారు 1.33 బిలియన్‌ డాలర్ల నష్టం చవిచూడాల్సి రావచ్చనే అంచనాలు వెలువడ్డాయి. 1982లో లిస్టింగ్‌ తర్వాత మిత్సుబిషి ఈ స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో సంస్థను నిలబెట్టేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా మిత్సుబిషి.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పేజరో ఎస్‌యువీ ఉత్పత్తిని నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది. కాగా, జపాన్‌లో ఉన్న సంబంధిత కర్మాగారం మూతపడనుంది. అంతేకాకుండా, యూరోప్‌, ఉత్తర అమెరికాల్లో కూడా తన కార్యకలాపాలను తగ్గించుకుని... ఆసియాపై దృష్టి కేంద్రీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని