సగానికిపైగా కోలుకున్నారు: కేంద్రం
close

తాజా వార్తలు

Published : 15/06/2020 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సగానికిపైగా కోలుకున్నారు: కేంద్రం

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజు 11వేల కేసులకు పైగా నమోదయ్యాయి. అయితే మహమ్మారి‌ ఉద్ధృతమవుతున్నప్పటికీ కోలుకున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది. ఆదివారం నాటికి రికవరీ రేటు 50.60 శాతానికి చేరిందని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,20,922 మంది మహమ్మారి బారిన పడగా 1,62,379 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 11,929 కేసులు నమోదవ్వగా 8,049 మంది డిశ్చార్జి అయ్యారు. అయితే 311 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,195కి చేరింది.

మరోవైపు కరోనా తీవ్రత అధికంగా ఉన్న దిల్లీలో వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్ బైజల్‌తో పాటు ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దిల్లీ ఆసుపత్రుల్లో పడకల కొరత దృష్ట్యా తక్షణమే 500 రైల్వే ఐసోలేషన్‌ బోగీలను కేటాయిస్తున్నట్లు అమిత్‌ షా వెల్లడించారు. తద్వారా 8వేల అదనపు పడకలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. భారీ స్థాయిలో కరోనా పరీక్షలు చేపడతామన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని