close

తాజా వార్తలు

Published : 22/09/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. సరిహద్దులో రాత్రిపూట పాక్‌ డ్రోన్ల కలకలం!

భారత సరిహద్దులో పాకిస్థాన్‌ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఆ దేశ డ్రోన్లు రాత్రి పూట నియంత్రణ రేఖ వెంబడి చక్కర్లు కొడుతున్నాయని, ఉగ్రవాదుల కోసం ఏకే 47 తుపాకులను కిందకు జారవిడుస్తున్నట్టు జమ్మూకశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. తాజాగా అఖ్నూర్‌లోని ఓ గ్రామంలో దాడులకు వినియోగించే రైఫిల్స్‌, ఒక పిస్తోల్‌ గుర్తించినట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. లోక్‌సభ సమావేశాల్ని బాయ్‌కాట్‌ చేస్తున్నాం: అధిర్‌

వ్యవసాయ బిల్లుల ఆమోదం నేపథ్యంలో రాజ్యసభలో ఆదివారం చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితులతో కొనసాగుతున్న రాజకీయ సెగ లోక్‌సభను తాకింది. రాజ్యసభ నుంచి సస్పెండయిన ఎనిమిది మంది ఎంపీలకు సంఘీభావంగా కొన్ని విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. లోక్‌సభ కార్యకలాపాలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రాజస్థాన్‌తో చెన్నై.. ఫేవరెట్‌గా ధోనీసేన

టీ20 ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై జట్టు రెండో మ్యాచ్‌ ఆడుతోంది. షార్జా వేదికగా రాజస్థాన్‌తో చెన్నై తలపడుతోంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ధోనీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. మరోవైపు రాజస్థాన్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి మ్యాచ్‌ కావడం విశేషం. లైవ్‌ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

4. సిలబస్‌ కుదించిన ఇంటర్‌ బోర్డు

కరోనా పరిస్థితులు, తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి, రెండో సంవత్సరం సిలబస్‌లో 30 శాతం కుదిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కుదించిన సిలబస్‌ ప్రకారమే వార్షిక, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ

ఏపీ సీఎం జగన్‌ దిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో సీఎం జగన్‌ ఆయన్ను కలిశారు. విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం, కొవిడ్‌ సహా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధుల అంశాలను అమిత్‌షాకు సీఎం వివరించారు. ఈ భేటీలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలూ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 

6. డిక్లరేషన్‌ ఇస్తే తప్పేంటి?: చంద్రబాబు

తిరుమల డిక్లరేషన్‌ వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను తెదేపా, భాజపా తీవ్రంగా ఖండించాయి. తాజాగా డిక్లరేషన్‌ వ్యవహారంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. అన్యమతస్థుడైన ముఖ్యమంత్రి డిక్లరేషన్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా తెదేపా నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. విహారానికి సిద్ధం..

కరోనా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరు నెలలుగా ఇంటికే పరిమితయ్యారు. ఉన్న ఊరిలో కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేకుండాపోయాయి. ఇక ఊరు దాటి వెళ్లడంపై దాదాపు నిషేధమే ఉండేది. ప్రస్తుతం ప్రయాణాల్లో ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ప్రజలు విహారయాత్రలకు వెళ్లాలని తెగ ఆరాటపడుతున్నారట. ఈ విషయాన్ని గూగుల్‌ సంస్థ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు‌: కొత్త నిజాలు

2017లో తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్‌ కేసు సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా సుపరిపాలన వేదిక సహ చట్టం ద్వారా ఈ కేసుకు సంబంధించిన పురోగతిపై వివరాలు అడగ్గా సరికొత్త విషయాలు తెలిశాయి. గత రెండేళ్లలో 12 డ్రగ్స్‌ కేసులు నమోదైనట్లు ఆర్టీఐకి రాసిన లేఖ ద్వారా వెల్లడైంది. మొత్తం 12 కేసులు పెట్టగా, అందులో 8 కేసుల్లోనే ఎక్సైజ్‌శాఖ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై ఎక్సైజ్‌శాఖ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఆ మ్యాచ్‌ను 20 కోట్ల మంది చూశారు..

కరోనా ప్రభావంతో భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఇండియాలో జరిగాల్సిన టీట్వంటీ మెగా సంబరం ఈ నెల 19 దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ స్పోర్ట్స్‌ మెగా ఈవెంట్‌ తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి, చెన్నై జట్ల మధ్య జరిగింది. ఆసక్తిరకంగా సాగిన ఈ పోరులో చెన్నై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను 20 కోట్ల మంది వీక్షించినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఆ ఒప్పందాన్ని మేం ఒప్పుకోం..!

టిక్‌టాక్‌ కొనుగోలుకు అమెరికా సంస్థలైన ఒరాకిల్‌ కార్పొరేషన్‌, వాల్‌మార్ట్‌ల ఒప్పందాన్ని చైనా ఒప్పుకోకపోవచ్చని అధికారిక పత్రిక గ్లోబల్‌ ట్వీట్‌ చేసింది. ఈ ఒప్పందం అన్యాయమని అభిప్రాయపడింది. కొత్త ఒప్పందం ప్రకారం అమెరికా కంపెనీలతో కలిసి ‘టిక్‌టాక్‌’ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ఓ సంస్థను ఏర్పాటు చేయనుంది. దీనిని టిక్‌టాక్‌ గ్లోబల్‌గా వ్యవహరించనున్నారు. దీని బోర్డులో మెజార్టీ వ్యక్తులు అమెరికాకు చెందిన వారే ఉంటారు. దీనిపై గ్లోబల్‌టైమ్స్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.