close

తాజా వార్తలు

Updated : 23/09/2020 11:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ చికిత్స పరిశోధనల్లో మరో ముందడుగు

వాషింగ్టన్‌ : ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. అయితే అదే సమయంలో దీనిని నియంత్రించే చికిత్స విధానాలపై కూడా పరిశోధనలు సాగుతున్నాయి. వాషింగ్టన్‌లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్సింగ్‌ ట్రాన్స్‌లేషనల్‌ సైన్సెస్(ఎన్‌సీఏటీసీ), నావల్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ(ఎన్‌ఆర్‌ఎల్‌)లకు చెందిన శాస్త్రవేత్తల బృందం నూతన సాధనాన్ని అభివృద్ధి చేసింది. కొవిడ్‌-19కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్‌ ఒక కణానికి ఎలా సోకుతుందో ఈ కొత్త సాధనం  గుర్తిస్తుందని వెల్లడించింది. తద్వారా కొవిడ్‌ చికిత్సలో కణాలు ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా ఔషధాలు ఏ విధంగా నిరోధించగలుగుతాయనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చని స్పష్టంచేస్తున్నారు. తాజా విధానం కొవిడ్‌  చికిత్సకోసం కొత్త ఔషధాల అన్వేషణ ప్రక్రియను వేగవంతం చేస్తుందని చెబుతున్నారు.

వైరస్‌ ఉపరితలంపై స్పైక్‌ ప్రోటీన్‌ సాయంతో కణాలను ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా ఈ  ‘ఫ్లోరోసెంట్‌ నానో పార్టికల్‌ ప్రోబ్‌’ విధానం దోహదపడనుంది. ఈ పరిశోధనల ద్వారా వైరస్‌ను మానవ కణాలకు సోకకుండా నిరోధించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  ఏసీఎస్‌ నానో జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ‘SARS-CoV-2 కణాలను అంటుకోకుండా నిరోధిస్తూ.. వాటిని ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా చూసే స్క్రీనింగ్‌ వ్యవస్థను సృష్టించడమే మా లక్ష్యం’ అని ఎన్‌సీఏటీఎస్‌ శాస్త్రవేత్త కిరిల్‌ గోర్ష్‌కోవ్‌ వివరించారు.

ఈ స్క్రీనింగ్‌లో నిజమైన వైరస్‌ను ఉపయోగించడం కష్టంతో కూడుకున్నది. ఇందుకోసం నానో పార్టికల్స్‌ను ఉపయోగించి వైరస్‌ ఏ విధంగా కణాలకు సోకుతుందో తెలుసుకున్నారు. ఆ ప్రోబ్‌ను రూపొందించడానికి కాడ్మియం, సెలీనియం నుంచి రూపొందించిన క్వాంటమ్‌ డాట్‌ అనే ఫ్లోరోసెంట్‌ నానో పార్టికల్‌ను ఎన్‌ఆర్‌ఎల్‌ శాస్త్రవేత్తలు తయారుచేశారు. వైరస్‌ స్వభావాన్ని వేగంగా గుర్తించడం, సురక్షిత కొవిడ్‌ చికిత్సా విధానానికి ఈ స్క్రీనింగ్‌ దోహదపడుతుందని పరిశోధకులు వెల్లడించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.