తెలంగాణలో నూతన ఎలక్ట్రిక్‌ వాహన పాలసీ 
close

తాజా వార్తలు

Published : 30/10/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో నూతన ఎలక్ట్రిక్‌ వాహన పాలసీ 

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) నూతన పాలసీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2020-2030 కాలానికి ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన విధానాలను వెల్లడిస్తూ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్‌ హబ్‌గా మార్చే ప్రణాళికలో భాగంగా నూతన విధానాలను రూపొందించినట్లు ఆ శాఖ పేర్కొంది. తాజా విధానాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది.

రాష్ట్రంలోనే కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారికి పలు రాయితీలను ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిలో భాగంగా తొలి 2 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, 20వేల ఆటోలు, మొదటి 5వేల 4 చక్రాల వాహనాలు, మొదటి 10వేల లైట్‌ గూడ్స్‌ వాహనాలు, మొదటి 5వేల ఎలక్ట్రిక్‌ కార్లు, 500 ఎలక్ట్రిక్‌ బస్సులకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్‌ రుసుం మినహాయింపు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్‌ రుసుం పూర్తిగా తొలగించనున్నట్లు తెలిపింది. ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం అందిస్తూ ఛార్జింగ్‌ అవసరాల కోసం అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని