మళ్లీ లాక్‌డౌనా? అదేం లేదు: ఉద్ధవ్‌ 
close

తాజా వార్తలు

Updated : 12/06/2020 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ లాక్‌డౌనా? అదేం లేదు: ఉద్ధవ్‌ 

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ అక్కడ కొత్తగా మళ్లీ పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తారనే వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. అలాంటి నిర్ణయమేదీ తమ ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను అందరూ పాటించాలని, జన సమూహాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే వారం నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడతాయంటూ పుకార్లు చెలరేగాయి. దీంతో ప్రజల్లో గందరగోళంతో పాటు భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదంటూ సీఎం ట్విటర్‌లో స్పష్టంచేశారు. ఇలాంటి అవాస్తవాలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతాయనీ.. నిజానిజాలు తెలుసుకోకుండా పుకార్లను వ్యాపింపజేయవద్దని సీఎం కార్యాలయం సూచించింది. 

దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 97,648 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 3590మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి

లక్ష కేసులకు చేరువలో మహారాష్ట్ర!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని