దిల్లీలో అదుపులోకొచ్చిన‌ క‌రోనా!
close

తాజా వార్తలు

Updated : 02/07/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో అదుపులోకొచ్చిన‌ క‌రోనా!

కొవిడ్‌ కేసులు తగ్గుతున్నాయ‌ని కేజ్రీవాల్ వెల్ల‌డి

దిల్లీ: దేశ రాజ‌ధానిలో క‌రోనా వైర‌స్‌ మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం అదుపులోకి వ‌చ్చిన‌ట్లు దిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. నెలక్రితం తాము అంచ‌నా వేసిన‌ట్లుగా భ‌యాన‌క ప‌రిస్థితి ప్ర‌స్తుతం లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా దిల్లీలో క‌రోనా వైర‌స్ క్రియాశీల కేసుల సంఖ్య‌ త‌గ్గుముఖం ప‌ట్టింద‌న్నారు. జూన్ 30నాటికి దిల్లీలో ల‌క్ష కేసులు న‌మోదౌతాయ‌ని, వాటిలో 60వేల యాక్టివ్ కేసులు ఉండొచ్చ‌ని తొలుత అంచ‌నా వేశామ‌న్నారు. అయితే ప్ర‌స్తుతం దిల్లీలో 26వేల క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయ‌న్నారు. ప్ర‌తిఒక్క‌రి కృషి ఫ‌లితంగానే వైర‌స్ వ్యాప్తిని అదుపులోకి తీసుకొచ్చామ‌ని కేజ్రీవాల్ అన్నారు. ప‌రిస్థితి చేజారిపోకుండా త‌మ‌కున్న అవ‌కాశాల‌న్నింటినీ వినియోగించుకున్నామ‌ని తెలిపారు. క‌రోనా నియంత్ర‌ణ‌లో దిల్లీ ప్ర‌జ‌ల స‌హ‌కారం ఎంతోఉంద‌ని ప్రశంసించారు.

'ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా క‌రోనా రోగుల‌ కోసం కొత్త‌గా 15వేల ప‌డ‌క‌ల‌ను సిద్ధం చేసినప్ప‌టికీ వీటిలో ప్ర‌స్తుతం 5800మంది రోగులు మాత్ర‌మే ఉన్నారు. వైర‌స్ బారినప‌డిన‌వారిలో నిత్యం కోలుకుంటున్న వారిసంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారీస్థాయిలో కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేప‌ట్టాం. తొలుత ప్ర‌తి 100మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 31మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని, ప్ర‌స్తుతం వంద మందికి ప‌రీక్ష చేస్తే 13మందికి పాజిటివ్ వ‌స్తోంది' అని దిల్లీ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్ర‌కారం, జులై ఒక‌టో తేదీనాటికి 87,360 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 58,348మంది కోలుకున్నారు. వైర‌స్ సోకిన వారిలో ఇప్ప‌టివ‌ర‌కు 2742మంది మృత్యువాత‌ప‌డ్డారు. ఇదిలాఉంటే, దేశంలో జులై 1వ తేదీ నాటికి 5,85,493 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 17,400 మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని