IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు
close

తాజా వార్తలు

Updated : 13/06/2020 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

అంతరాలు అంతమైన వేళ..!

జాత్యాంతర వివాహాలకు అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు 53 వసంతాలు పూర్తయ్యాయి. ఈ శుభ సందర్భంగా కోర్టు మెట్ల వద్ద మిచెల్‌ డేవిస్‌, బార్టన్‌ కోర్బెట్‌ లీథర్‌వుడ్ అనే జంట ఒక్కటైంది. అనంతరం వారు నేరుగా బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ ప్లాజాగా పేరు మారిన 16th స్ట్రీట్‌కు వెళ్లి ఆఫ్రో-అమెరికన్‌ జార్జిఫ్లాయిడ్‌ మృతిపై నిరసన తెలియజేస్తున్న ఆందోళనకారులకు సంఘీభావం ప్రకటించారు.
 


హితం కోరి.. మితంగానే

ఇంగ్లాండ్‌లోని విండర్స్‌ క్యాజిల్‌లో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 అధికారిక జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. వివిధ సైనిక బలగాల కవాతుతో యేటా అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమం కరోనా మహమ్మారి కారణంగా కొద్దిమందితోనే ముగించాల్సి వచ్చింది.


మహాత్ముడికి రక్షణ

ఆఫ్రో-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అందులో పాల్గొంటున్న కొందరు ఆందోళనకారులు స్మారకచిహ్నాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌ పార్లమెంట్‌ స్క్వేర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ముందు జాగ్రత్తగా రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్న కార్మికులు. 


క్షేమంగా వెళ్లి రమ్మని దీవించు!

గువాహటిలో గజరాజు నుంచి ఆశీర్వచనం పొంది కానుక సమర్పిస్తున్న ఓ బస్సు డ్రైవర్‌.
 


మాస్కు వాడు.. చైనావన్నీ వీడు!

ఈ చిత్రంలో వినాయకుడి వేషధారణలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పరమేశ్‌ జోలాడ్. చైనా వస్తువుల వాడకాన్ని వ్యతిరేకించాలని కోరుతూ కర్ణాటక విధాన సౌధ ఎదుట ప్రజలకు మాస్కులు పంపిణీ చేస్తున్నాడు. 


 వారాంతం లాక్‌డౌన్‌లో చిక్కుకున్నారు!

కొవిడ్‌ కేసుల ఉద్ధృతిని అదుపు చేసేందుకు వారాంతాలు, పర్వదినాల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ అమలు చేయాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర మెడికల్‌ కేసులు మినహాయించి ఈ-పాస్‌లు కలిగిన వారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పడంతో భతిండా శివారులో భారీ ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది.
 


దేశ సేవక.. ఆనంద డోలిక..

దేహ్రాదూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమిక్‌లో విజయవంతంగా శిక్షణ పూర్తయిన సందర్భంగా ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్న యువ సైనికాధికారులు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని