close

తాజా వార్తలు

Updated : 14/08/2020 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సహాయక చర్యల్లో పాల్గొన్న 22 మందికి కరోనా

తిరువనంతపురం: కేరళలోని కొలికోడ్‌ విమాన ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో పాల్గొన్న వారిలో.. జిల్లా కలెక్టర్‌ సహా పలువురు అధికారులకు కరోనా వైరస్‌ సోకింది. గత శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం అనంతరం సహాయక చర్యల్లో పాల్గొన్న మలప్పురం జిల్లా కలెక్టర్‌ గోపాల కృష్ణన్‌తో పాటు మొత్తం 22 మంది అధికారులకు కరోనా సోకినట్టు వైద్యాధికారులు తెలిపారు. వారిని క్వారంటైన్‌ కేంద్రంలో చేర్చినట్లు వివరించారు.

కొవిడ్‌-19 కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి చేర్చే వందే భారత్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా...  ఈ విమానం 184 ప్రయాణికులతో దుబాయి నుంచి కొలికోడ్‌కు వచ్చింది. కొలికోడ్‌లోని టేబుల్‌ టాప్‌ రన్‌వే పై ల్యాండ్‌ చేస్తున్న సమయంలో ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం 19 మంది మరణించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.