బల్దియా కార్యాలయంలో మరో కరోనా కేసు
close

తాజా వార్తలు

Published : 10/06/2020 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బల్దియా కార్యాలయంలో మరో కరోనా కేసు

హైదరాబాద్‌: నగరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజుకు వందకుపైనే కేసులు నమోదువుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా బల్దియా కార్యాలయంలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్‌ పేషీలో పనిచేస్తున్న అటెండర్‌కు కరోనా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మేయర్‌ పేషీని మూసివేసి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను అధికారులు ఇళ్లకు పంపించారు. మేయర్‌ కార్యాలయాన్ని శానిటైజ్‌ చేస్తున్నారు.

మరోవైపు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించాలని అధికారులు నిర్ణయించారు. రెండు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌కు కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆరోగ్య విభాగంలో పనిచేసే దాదాపు 40 మంది ఉద్యోగులకు అధికారులు సమాచారం అందించారు. ఈ మేరకు నగరంలోని సరోజినీ దేవి ఆస్పత్రిలో వారు పరీక్షలకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని