కేంద్రం తీరును తప్పుబట్టిన రాహుల్‌
close

తాజా వార్తలు

Published : 28/06/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్రం తీరును తప్పుబట్టిన రాహుల్‌

దిల్లీ: దేశంలో కరోనా కేసులు 5లక్షలు దాటేసిన వేళ కేంద్ర ప్రభుత్వం పని తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఈ మహమ్మారిని  తరిమికొట్టేందుకు ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదన్నారు. ఈ వైరస్‌పై పోరాటానికి నిరాకరించడం ద్వారా ప్రధాని మోదీ లొంగిపోయారంటూ ట్విటర్‌లో ఆరోపించారు. ప్రభుత్వం మార్చిలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి కరోనాపై కేంద్రం చేపడుతున్న చర్యలపై రాహుల్‌ విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా కేసుల తీవ్రత మరింత పెరగడంతో శనివారం ఆయన ట్విటర్‌లో విమర్శలు చేశారు. 

‘‘దేశంలోని కొత్త ప్రాంతాల్లోనూ కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. ఈ మహమ్మారిని ఓడించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారు. కరోనాపై పోరాటానికి నిరాకరిస్తుండం ద్వారా ఆయన సరండర్‌ అయ్యారు’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.  

కేంద్ర ప్రభుత్వం గానీ, ఐసీఎంఆర్‌ ప్యానల్‌గానీ గత రెండువారాలకు పైగా సమావేశాలు సైతం నిర్వహించలేదంటూ ‘ద ప్రింట్‌’లో వచ్చిన కథనాన్ని రాహుల్‌ తన ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు. 

దేశంలో గత 24గంటల్లోనే రికార్డు స్థాయిలో 18,552 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5లక్షలు దాటేసింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 2,95,880మంది రికవవరీ కాగా.. 15600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 1,97,387 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని