పీవీఆర్‌ వేతనాలు, ఉద్యోగాల కోత
close

తాజా వార్తలు

Published : 09/06/2020 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీవీఆర్‌ వేతనాలు, ఉద్యోగాల కోత

రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.300 కోట్లు సమీకరించే యోచన

దిల్లీ: మల్టీప్లెక్స్‌ల నిర్వహణ సంస్థ పీవీఆర్‌ వ్యయ నియంత్రణ చర్యలను చేపట్టింది. కొవిడ్‌-19, లాక్‌డౌన్‌ పరిణామాల నేపథ్యంలో వ్యాపారంపై ప్రభావం పడటంతో వేతనాలు, ఉద్యోగాల కోతకు నిర్ణయం తీసుకుంది. ఇంక్రిమెంట్లనూ వాయిదావేసినట్లు సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా సినిమాల నిలిపివేత కారణంగా సినిమా ప్రదర్శన, దానికి సంబంధించిన వ్యాపారాల నుంచి తమకు ఎటువంటి ఆదాయం రాలేదని కంపెనీ తెలిపింది. దీంతో తమ లాభదాయకత, నిధుల లభ్యతపై గణనీయ ప్రభావం పడిందని పేర్కొంది. తిరిగి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ పరిస్థితి కొనసాగొచ్చని వెల్లడించింది. అందుకే వ్యయ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ సమయంలో లేఆఫ్‌ల ద్వారా సిబ్బంది సంఖ్యను తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. వివిధ స్థాయిల్లోని ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించినట్లు పేర్కొంది. మరోవైపు రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.300 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు పీవీఆర్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని