హైకోర్టులో పీవీపీకి ఊరట
close

తాజా వార్తలు

Updated : 01/07/2020 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైకోర్టులో పీవీపీకి ఊరట

హైదరాబాద్‌: వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. విల్లా గొడవకు సంబంధించి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో పీవీపీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసు విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పీవీపీ బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈకేసుకు సంబంధించి పోలీసులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని